ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : బేడ బుడగ జంగం మేధావులు, నాయకులు, ఉద్యోగస్తులు, విద్యావంతులు, యువకులను సమ్మేళనం చేస్తూ బేడ బుడగ జంగం చైతన్య వేదిక ద్వారా రాజ్యాధికారం కొరకు పిలుపునిచ్చారు. విజన్- 2024 దిశలో బేడ బుడగ జంగాలు రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాల్సిన అవసర, ఆవశ్యకత ఎంతో ఉందని బెడ బుడిగ కుల సంఘ నాయకులు డాక్టర్ ఎన్ఆర్.వెంకటేశం, తూర్పాటి జగదీశ్వర్, కోడిగంటి నరసింహ, గగనం మంతప్ప, నిదానకవి జయమ్మ, కడమంచి సహదేవుడు, చింతల యాదగిరి, పత్తి కుమార్, గగనం శేఖర్, కార్యక్రమ స్వమన్వయకర్తలు గిరి కోండపల్లి, సిరివాటి రమేష్, కడమంచి చెన్నయ్య, కళ్యాణం శరత్ చంద్ర అన్నారు. బేడ బుడగ జంగం కుల నాయకులు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు ఏకత్రాటిపైకి వచ్చినట్లు తెలియజేశారు. ఈ మేరకు సైఫాబాద్ లోని శాంతి చక్ర కాన్ఫరెన్స్ హాల్లో 6 గంటల పాటు సాగిన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశంలో రాబోయే రోజుల్లో కార్యచరణను సిద్ధం చేసి రాజకీయ అభివృద్ధి కొరకు త్వరలో రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున బేడ బుడగ జంగం రాజకీయ చైతన్య సదస్సును నిర్వహించి రాజ్యాధికారం సాధిస్తామని తెలియజేశారు. ఈ బేడ బుడగ జంగం రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా బేడ బుడగ జంగం సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు హాజరై ఒక గొప్ప చరిత్రత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక సమిష్టి కార్యచరణ విధానంతో బేడ బుడగ జంగం కులం రాజకీయ అడుగులు వేసే విధంగా క్షుణ్ణంగా ప్రతి అంశంపై చర్చించి భవిష్యత్తులో బలోపేతంగా పని చేసేందుకు సంఘాలకు, వర్గాలకు అతీతంగా కంకణ బద్ధులయ్యారు.