రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. టిఆర్ఆర్

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 02: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.సోమవారం పరిగి పట్టణంలోని 9వ వార్డు,11వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి,బిఆర్ఎస్ ప్రభుత్వమే అని, రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని,గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు వివరిస్తూ,ఈసారి కాంగ్రెస్ పార్టీని దీవించండి అని కోరారు.ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న నర్సింలు,కడుమూరి శ్రీనివాస్,  మాధవరెడ్డి,సర్వర్ హుస్సేన్,ఖదీర్,నసీం భాయ్,హుస్సేన్,విఠల్ నాయక్,  రామకృష్ణ,జగన్ సెట్,కుడుముల యాదయ్య,మల్లేష్,కుడుముల వెంకటేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు మాజు,వెంకట్,మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు,కేరళ సెక్రటరీ తెరస ఫ్రాన్సిస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పట్లోళ్ల  సురేఖ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జనుపాల రజిత రెడ్డి, సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page