- ప్రధాని మోడీ, కేంద్రాన్ని తిట్టడమే పని
- ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియాపై నిర్బంధం
- సాయిగణేశ్ మృతికి కారణమైన వారిపై మాత్రం కేసు లేదు
- ధాన్యం సేకరణపై బహిరంగ చర్చకు సిద్ధమా
- ప్రగతి భవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తాం
- ఎంఎంటిఎస్ విస్తరణకు మోకాలడ్డుతున్న కెసిఆర్
- మీడియా సమావేశంలో మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 23 : రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయం నడుస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియా పై నిర్బంధం పెరిగి పోయిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని ఆయన ఆరోపించారు. మరోసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మంత్రులపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని, మళ్ళీ గెలుస్తామో లేదో.. ఉన్నప్పుడు దోచుకుందామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తారన్నారన్నారు. ఖమ్మం బీజేపీ కార్యకర్తపై 16 కేసులు పెట్టారు. మూడు సార్లు జైలుకి పంపించారు. పోలీసుల వేధింపులు నిత్య కృత్యం అయ్యాయని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగో తేదీ తన పెళ్లి ఉందని.పెళ్లి పనులు చేసుకుంటున్నానని చెప్పినా పోలీసులు వినలేదని, దీంతో పోలీస్ స్టేషన్ ముందు విషం తీసుకున్నారన్నారు. తన ఆత్మహత్యకు కారణం మీడియా ముందు తెలిపినా.. కేసు నమోదు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న సాయి గణెళిష్ పై కేసు పెట్టారు? కానీ కారణం అయిన వారి పై కేసు పెట్టలేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తెరాస నేతలు పబ్బం గడుపుతున్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాస నేతల ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. ఇప్పుడు ప్రగతిభవన్ కల్వకుంట్ల ప్రగతిభవన్‌గా ఉందని.. దానిని భవిష్యత్‌లో తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామని కిషన్ రెడ్డి అన్నారు. తెరాస నాయకులు ఆందోళన చేస్తే లేని ఇబ్బంది.
భాజపా కార్యకర్తలు చేస్తే ఎందుకు వేస్తోందని ప్రశ్నించారు. సాయి గణెళిష్ ఓ సాధారణ కారు డ్రైవరని.. తన అమ్మమ్మ వద్ద ఉంటారని, నెలలో 15 రోజులు భాజపా కోసం పనిచేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పోలీసులు సాయి గణెళిష్‌పై 16 కేసులు పెట్టారని.. 3 సార్లు జైలుకు పంపించి రౌడీషీట్ తెరిచి వేధించారని ఆయన తెలిపారు. ఖమ్మంలో కేటీఆర్ పర్యటన ఉంటే మూడ్రోజుల ముందే సాయి గణెళిష్‌ను పోలీసులు పీఎస్‌లో నిర్బంధించారన్నారు. పెళ్లి ఉందన్నా వినకుండా సాయి గణెళిష్‌ను పోలీసులు వదలలేదని.. దీంతో మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస నేత వేధింపులకు ఖమ్మంలో ఓ కుటుంబ మంతా ఆత్మహత్య చేసుకుందని విమర్శించారు. మెదక్, కామారెడ్డిలోనూ తెరాస ఆగడాలకు వ్యక్తులు బలి అయ్యారన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసే వారిపై రాష్ట్ర సర్కారు దౌర్జన్యాలు చేస్తోందని మండిపడ్డారు.
’తెరాస నేతలు ప్రధాని దిష్టిబొమ్మను తగలబెడతారు.. అదే మేము చేస్తే నిర్బంధిస్తారా? అంటూ ప్రశ్నించారు. కేంద్రంపై తెరాస నేతలు రోజూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని’ దుయ్యబట్టారు. కేంద్రంపై తెరాస నేతలు రోజూ బురద జల్లుతున్నారన్నారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధి కోసం గజ్వేల్, సిరిసిల్లకు ఎంతిచ్చారు.. దుబ్బాకకు ఎంతిచ్చారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు వైద్యం కోసం ఆస్పత్రులు ఏర్పాటు చేశామని, జాతీయ రహదారులు వేశామన్న కేంద్ర మంత్రి.. రాష్ట్రంపై ఏ విధంగా వివక్ష చూపెట్టామో చెప్పాలని తెరాస నేతలను ప్రశ్నించారు. రోడ్ల శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గత కొన్ని నెలలుగా అడుగుతున్నామని.. వారి ఆలస్యం వల్లే ఈ నెల 29న ఆ కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇవ్వాలని అడిగితే ఇప్పటివరకు అతీగతి లేదన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఏర్పాటు చేస్తామంటే రాష్ట్ర సర్కారు ముందుకు రావడంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అభద్రతాభావంతో ఉందని ఆయన విమర్శలు గుప్పించారు.
భాజపా, నరేంద్ర మోదీని ఏ విధంగా తిట్టాలనే కేసీఆర్ కుటుంబం ఆలోచిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్ల వద్ద వి•టర్లు చెప్పాలని ఎవరూ అనలేదన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్నారు. గత 8 సంవత్సరాలుగా ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్? విసిరారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర సర్కారు 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. భాజపా సర్కారు దేశానికంతటికీ ఒకే పాలసీని తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టాల్రను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్ని స్తోందన్నారు. ధాన్యం కొనుగోలు ఒప్పందంపై సంతకం పెట్టింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. మెడపై కత్తి పెడితే సంతకం పెట్టామని అంటున్నారని.. అసలు వారి మెడపై వేలు కూడా పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రైతుల నుంచి చివరి గింజవరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్టాల్లో్ర లేని సమస్య ఒక్క తెలంగాణలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దేశంలో ఖర్చు చేసే ప్రతి పైసాకు కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉందన్నారు.
ఏ రాష్ట్రమైనా తమకు ఒక్కటేనన్నారు. ఇటీవల గుజరాత్? గురించి తెరాస నేతలు మాట్లాడుతున్నారన్నారు. దేశం కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గవర్నర్ గురించి పట్టించుకునే సంప్రదాయం ఈ రాష్ట్రంలో లేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. జాతరకు వెళ్తే కూడా ప్రొటోకాల్ పాటించని దుస్థితి ఇక్కడ ఉందన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ అనే గౌరవం లేకుండా మంత్రులతో తిట్టించారని విమర్శించారు. అనేక ముఖ్యమంత్రులు వచ్చారు.. పోయారని.. కానీ ఇంత దిగజారుడు రాజకీయం ఏ సీఎం చేయలేదన్నారు. అంతకు ముందు బీజేపీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లాస్ పీకారు. బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. కొత్త భవన నిర్మాణాల జోలికి వెళ్లోద్దని, ఈ విషయంపై తనకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సోషల్ వి•డియాలో కార్పొరేటర్లు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. స్థానిక సమస్యలపై కార్పొరేటర్లు పోరాటం చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్లు కష్టపడి పనిచేయాలన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు.