రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ సమస్యలు

ధరణితో దరిద్రం వొచ్చింది
దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీది
దున్నేవాడికి భూమి లేకుండా టిఆర్‌ఎస్‌ ‌కుట్రలు
ఔటర్‌ ‌చుట్టూ మాయం అవుతున్న భూములు
ధరణి సమస్యలపై రచ్చబండలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ‌నేతలు ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ ‌వద్ద కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో నేతలు పాల్గొని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధరణి వొచ్చి దరిద్రం వొచ్చిన్లటైందని దుయ్యబట్టారు. దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదేనని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వీహెచ్‌ అన్నారు. ధరణి పోర్టల్‌ ఎం‌దుకు తీసుకొచ్చారో సీఎం కేసీఆర్‌కైనా తెలుసా అని ప్రశ్నించారు. దొరలకు లాభం చేసేందుకే ధరణి ఆరోపించారు. నగరం చుట్టూ ఓఆర్‌ఆర్‌ ‌వొచ్చాక భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని వీహెచ్‌ అన్నారు. ఓఆర్‌ఆర్‌ ‌చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వొచ్చే లోపు ఉన్న భూములు మాయం చేస్తారని వీహెచ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హెచ్‌ఎం‌డీఏ ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు.

కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పేదల భూములను దొరలు ఆక్రమిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ ‌చుట్టూ భూములన్నీ కబ్జా చేస్తున్నారు. మేం అధికారంలోకి వొచ్చేసరికి అన్ని భూములు కాజేస్తారు. ఇప్పటి నుంచే మనమంతా కలసికట్టుగా దీనిపై పోరాటం చేయాలి’ అని వీహెచ్‌ ‌పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ ‌దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను సవరించాలని డిమాండ్‌ ‌చేశారు. భూసమస్యలతో రైతులు చనిపోతున్నారని..హత్యలు కూడా జరుగుతున్నాయని కోదండరెడ్డి తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో చనిపోవడానికి భూ సమస్యలే కారణమన్నారు. అసైన్డ్ ‌భూములను అడ్డగోలుగా గుంజుకుంటున్నారన్న ఆయన… వాటిని వెంచర్లుగా వేసుకుని అధికార పార్టీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని కోదండ రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వంపై రైతులు పోరాడితే తాము అండగా ఉంటామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. ఎక్కడ భూములున్నా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోడు రైతులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌భూములు పంచితే.. తెరాస లాక్కుంటోందని సీతక్క ధ్వజమెత్తారు. భూముల విలువ పెంపు పేరుతో దందా చేస్తున్న సీఎం కేసీఆర్‌.. ‌దున్నేవాడికి భూమి లేకుండా చేస్తున్నాడని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఫార్మా సిటీ పేరుతో అడ్డగోలుగా భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఫారెస్ట్ అధికారులు సైతం భూములు లాక్కుంటూ.. పోడు రైతులపై దాడులు చేస్తున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి కారణంగా మహబూబాబాద్‌ ‌జిల్లా నారాయణపూర్‌లో 1800 ఎకరాలు ఆగమయ్యాయని సీతక్క ఆరోపించారు. భూమి అంటే తరతరాలుగా వొచ్చే ఆధారమని, కేసీఆర్‌ ‌ప్రభుత్వం దాన్ని దూరం చేస్తుందని వాపోయారు. కాంగ్రెస్‌ ‌భూములు పంచితే.. టీఆర్‌ఎస్‌ ‌గుంజుకుని ప్రైవేటు కంపెనీలకు పంచుతుందని సీతక్క విమర్శించారు. నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ‌నేతల పేర్లకు మారుతున్నాయని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page