రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

  • తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, యూటీలలో నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌
  •  నేటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 26న నామినేషన్ల పరిశీలన..29న ఉపసంహరణ
  •  మే 13న పోలింగ్‌..జూన్‌ 4న కౌంటింగ్‌

న్యూదిల్లీ/ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికలకు నేడు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మొత్తం 7 దశలలో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నాలుగో దశ ఎన్నికలకు ఈసీ నేడు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. కాగా తెలంగాణలో 17 స్థానాలతో పాటు ఆంధప్రదేశ్‌ (25 స్థానాలు), బీహార్‌ (5), రaార?ండ్‌ (4), మధ్యప్రదేశ్‌ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), ఉత్తర్‌ ప్రదేశ్‌ (13), పశ్చిమ బెంగాల్‌ (8), జమ్మూకాశ్మీర్‌ (1) లతో కలిపి మొత్తం 96 స్థానాలకుగాను నేడు నోటిఫికేషన్‌ జారీ కానుంది.

అభ్యర్థుల నుంచి నామినేషను నేటి నుంచి ఏప్రిల్‌ 25 వరకూ స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 29న నామినేషన్ల ఉప సంహరణతో పక్రియ పూర్తి అవుతుంది. కాగా మే 13న పోలింగ్‌ సరుగనుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ లాస్య నందిత మృతితో ఖాలీ అయిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానానికి ఇదే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న వోట్లు లెక్కించి, విజేతల్ని ఈసీ ప్రకటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page