రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

హైదరాబాద్‌ అడిక్‌మేట్‌లో ఇద్దరు, నిర్మల్‌ ‌జిల్లాలో ఇద్దరు, కొత్తగూడెంలో ఒకరు..మృత్యువాత
పలువురికి గాయాలు..హాస్పిటల్‌లో చేరిక
రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం అచ్చుతాపురం క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న కుంజా వెంకటేశ్వరరావు (36) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మొద్దులగుడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. నిర్మల్‌ ‌జిల్లా సోన్‌ ‌మండలంలోని కడ్తాల్‌ ‌జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

గర్తు తెలియని వాహనం..ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. నిజామాబాద్‌ ‌నుంచి నిర్మల్‌కు వొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు నిర్మల్‌ ‌జిల్లా కేంద్రానికి చెందిన అవి•ర్‌(22), ‌బషీర్‌(22)‌గా పోలీసులు గుర్తించారు.

ఇక హైదరాబాద్‌ అడిక్‌మెట్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్‌మెట్‌ ‌ఫ్లై ఓవర్‌పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులను కామారెడ్డికి చెందిన భవన్‌(20), ‌నిర్మల్‌కు చెందిన రోషన్‌ (20)‌గా గుర్తించారు. మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. మృతులిద్దరు ఓ డిగ్రీ కాలేజీలో బీబీఏ చదువుతున్నారని, కళాశాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై రోడ్డు అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఒంగోలు నుండి హైదరాబాద్‌ ‌బి.ఎన్‌ ‌నగర్‌కు వస్తుండగా పెద్ద అంబర్‌పేట్‌ ‌వద్ద ఆగివున్న లారీని షిప్ట్ ‌కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పాదచారులతో సహా.. కారులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను స్థానికులు హయత్‌ ‌నగర్‌ ‌మాక్స్ ‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఒంగోలులో తమ బంధువుల చావుకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన బాధితులు ఆరుగురు బి.ఎన్‌ ‌రెడ్డి నగర్‌ ‌కు చెందిన వీరన్నారాయణ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page