రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం అమలు తీరు అధ్వాన్నం.

కొన్ని కార్యాలయలలో రెండు,మూడు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు.చివరకు రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌కి రెండవ అప్పీల్‌ ‌చేసీనా ఆ కమిషన్‌ ‌నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది.ఇప్పటికి లక్ష లాది రెండవ అప్పీల్లు పెండింగులో వున్నాయని తెలుస్తూ వుంది.రాష్ట్ర సమాచార కమిషన్‌ ఇం‌తవరకు ఒక్క జిల్లాలో కూడా పర్యటించిన దాఖలాలు లేవు. 

సమాచార హక్కు చట్టం ప్రజల చేతి లో వజ్రాయుధం లాంటిది.పాలన లో పారదర్శకత పెంచి,అవినీతి ని నిర్మూలనకు బీజం వేసి,జవాబుదారీ తనం పెంచే ఈ చట్టం అమలు లోకి వచ్చిసుమారు 18 సంవత్సరాలు అవుతూ వున్న ప్రభుత్వం,సమాచార కమిషన్‌ ‌ప్రజలకు అవగాహన కల్పించడం లో పూర్తిగా విఫలం అయినది.భారత ప్రభుత్వం అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలనే తాపత్రయం తో అప్పటి యు.పి.యే ప్రభుత్వం గొప్ప చట్టమయిన సమాచార హక్కు చట్టం ని అమలులోకి వచ్చింది.ఈ చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రజా సమాచార అధికారి,సహాయ ప్రజా సమాచార అధికారి అందుబాటులో వుంటారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో తప్పక సమాచార బోర్డ్ ‌లు వుండాలి. ప్రజలు వివిధ సమాచారం కోరుతూ అధికారులకు దరఖాస్తు చేస్తే నెల రోజుల లోపు సమాచారం ఇవ్వాలిసి వున్నా ఏదొ ఒక వంక తో దరఖాస్త్తుదారులకు తిప్పి పంపడం,లేదా సమాచారం లేదని చెప్పడం,సమాచారానికి ఇన్ని పేజీలు అంటూ రుసుం వసూలు చేయడం జరుగుతుంది.కొన్ని కార్యాలయలలో రెండు,మూడు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు.

చివరకు రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌కి రెండవ అప్పీల్‌ ‌చేసీనా ఆ కమిషన్‌ ‌నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది.ఇప్పటికి లక్ష లాది రెండవ అప్పీల్లు పెండింగులో వున్నాయని తెలుస్తూ వుంది.రాష్ట్ర సమాచార కమిషన్‌ ఇం‌తవరకు ఒక్క జిల్లాలో కూడా పర్యటించిన దాఖలాలు లేవు.జిల్లా పాలన అధికారులు తమ జిల్లా అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల లో కూడా సమాచార హక్కు చట్టం అమలు తీరు మీద చర్చించిన ఆనవాళ్లు కూడా లేవు.అధికారులకు ఈ చట్టం గూర్చి పూర్తి అవగాహన లేదు.కొన్ని జిల్లాలలో సమాచార హక్కు చట్టం కార్యకర్త లమీద దాడులు చేయడము,భయ భ్రాంతుల కు గురిచేయడం జరుగుతూ వుంది.దేశ వ్యాప్తంగా సహ చట్టం ఉద్యమకారుల మీద దాడులు జరుగుతూ వున్నాయి.అనేక మందిని పొట్టన పెట్టు కున్న ఉదంతాలూ వున్నాయి.సమాచారం కోసం దరకాస్తు చేస్తే అధికారులు సమాచారం ఇవ్వకుండా దరకాస్త్తుదారులు తమను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తూ వున్నారని అసత్య ఆరోపణలు చేసి కేసులు పెట్టిన సందర్భాలు గలవు.రాస్ట్ర కమిషన్‌• ‌కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం జరుగుతు వుంది.అన్ని రాష్ట్రాలలో ఈ చట్టం పకట్బంధీగా అమలు అవుతూంది.ఇకనయిన ప్రభుత్వం,రాస్ట్ర కమిషన్‌• ‌స్పందించి మన రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం ని పారదర్శకంగా అమలు చెయ్యాలని మా మనవి.అధికారులకు,ప్రజలకు చట్టం గురించి శిక్షణ ఇవ్వాలి.

సహ చట్టం గూర్చి….
స.హ చట్టం కింద దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిన అవసరం వుంది. లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించి నందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర కమిషనర్లు కూడా సమాచారం ఇవ్వని వారిని జైలుకు పంపవచ్చు అని చట్టంలో పేర్కొనబడింది.లేదా అర్జీదారుడే సంబంధిత పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు స్టేషన్‌ అధికారి కేసు రిజిస్టర్‌ ‌చేసేందుకు అంగీకరించకుండా ఫిర్యాదు ను తిరస్కరిస్తే కోర్టు లో ప్రయివేటు కంప్లైంట్‌ ‌ద్వారా క్రిమినల్‌ ‌కేసు నమోదుకు ఉత్తర్వులు పొందవచ్చు..

సమాచార హక్కు ప్రతి దరఖా స్తుదారుడు వినియోగదారుడే’’.30రోజుల్లో సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల ఫోరమ్‌ ‌కు వెళ్ళవచ్చు. సమాచారాన్ని కోరడానికి దరఖాస్తు ఫారం లేదు, కావలసిన సమాచారం తెల్లకాగితం పై రాసి పి.ఐ ఓ (ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు. అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్‌ ‌పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు.దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు’’.సెక్షన్‌ 2 (•)‌ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మైయిల్స్, అభిప్రాయాలు, పుస్తకాలు, ప్రకటనలు, సీడీలు, డివిడిలు, మొదలైనవి).

సెక్షన్‌ 2 (ష్ట్ర)‌ప్రకారం సమాచార చట్ట పరిధిలోకి వచ్చే కార్యా లయాలు. (ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలు) సెక్షన్‌ 2(‌ఱ) ప్రకారం రికార్డు నిర్వచనం. సెక్షన్‌ 2(•)‌ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు. ఏ ప్రభుత్వపు కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు అవసరం అయితే జిరాక్స్ ‌చేసుకోవచ్చు.గ్రామస్థాయి సమాచారం ఉచితం సెక్షన్‌ 3 ‌ప్రకారం పౌరులందరికి సమాచారం ఇవ్వాలి.దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు.సెక్షన్‌4(1)(•) ‌ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు నిర్వహణ.సెక్షన్‌ 4() ‌ప్రకారం స్వచ్చందముగా వెల్లడించ వలసిన సమాచారం ఎవరు ఆడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.సెక్షన్‌ 4(1)(మీ), (•) ‌ప్రకారం నిర్ణయాలు వాటికీ కారణాలు చెప్పకరలేదు… సమాచార హక్కు చట్టం ని ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలి.

-కామిడి సతీశ్‌ ‌రెడ్డి,
జడల్‌ ‌పేట,జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా
9848445134.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page