రాష్ట్రానికి ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు

అమిత్‌ ‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు
ఎక్కువ ఇచ్చారని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
దేవరకద్రలో పల్లె, పట్టణ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌

‌మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 4(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజల చమట చిందించి, రక్తం కార్చి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో దాదాపు మూడు లక్షల 68 వేల కోట్ల చెల్లిస్తున్నామని, అంబేద్కర్‌ ‌రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి కేవలం ఒక లక్ష 68 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది వాస్తవమని, కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాష్ట్రానికి అదనంగా రాలేదని, తాను చెప్పింది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షాకు దేవరకద్ర వేదికగా మంత్రి కేటీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. శనివారం మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 119 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. అమిస్తాపూర్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పల్లె పట్టణ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి మోడీ మాట ఇచ్చి తప్పారని, గత 8 సంవత్సరాల నుండి వికారాబాద్‌ ‌నుండి కృష్ణ నారాయణ పేట మీదుగా కర్ణాటక అలాగే గద్వాల నుండి మాచర్ల వరకు రైల్వే లైన్‌లో మంజూరు చేయాలని ఎన్నో దఫాలుగా విన్నవించినా దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉందని కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ‌ఘాటుగా విమర్శించారు.

రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక పచ్చి అబద్ధాలతో బద్నాం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మత చిచ్చు రేపుతున్నారని అన్నారు. దేవరకద్రలో చేపడుతున్న సంక్షేమ పథకాలు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఏ ఊరు అయినా వెళ్దామని, అక్కడ సంక్షేమ పథకాలు చేపడుతున్నారో లేదో చూద్దాం పదండన్నారు. ప్రజలు మేల్కొని చైతన్యవంతులు కావాలని అన్నారు. అలాగే యువత తప్పుదవ పట్టకుండా ఆలోచించాలన్నారు. 75 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ఆలోచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రజల కోసం పేద వారి కోసం పథకాలను రూపొందించారని అన్నారు. గతంలో ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లాలంటే ప్రజలు, గర్భవతులు భయపడే వాళ్ళని, తెలంగాణ వొచ్చాక మహిళలు 30 నుంచి 52 శాతం ప్రభుత్వ హాస్పిటల్‌లోనే కాన్పులు జరుగుతున్నాయన్నారు. పేద వారి ఇంటి కల నెరవేర్చినందుకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌పథకం తో పల్లెటూర్లలో అపార్ట్మెంట్‌ ‌కల్చర్‌ ‌తెచ్చామన్నారు పేద వారి కోసం బాధ్యతగా పని చేస్తున్నామని అన్నారు పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రైతన్నల కోసం నిరంతరంగా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మహబూబ్నగర్‌ ‌జిల్లా సస్యశ్యామలం చేసి తిడుతున్నారు ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని భాజపా నాయకులు పాదయాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మతం పేరుతో భయభ్రాంతులకు గురయ్యే విధంగా చేస్తున్నారన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ నీటి వాటా తేల్చాలని ఎన్ని సంవత్సరాల నుంచి అడిగిన ఇంతవరకు ఉలుకు పలుకు లేదన్నారు రాష్ట్రానికి 575 టీఎంసీలు నీళ్లు రాష్ట్ర విభజన ప్రకారం ఇవ్వాల్సి ఉందన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇటీవల రాష్ట్రంలో ఉన్న మసీదుల నూనె శివలింగాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో లో మంత్రులు వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎం‌పీ మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి రాష్ట్ర అ మైనారిటీ ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ఇం‌తియాజ్‌ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి ఇ ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి దామోదర్‌ ‌రెడ్డి జడ్పీ చైర్మన్‌ ‌లు ఎంపీపీలు సర్పంచులు వార్డ్ ‌సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page