రాష్ట్రానికి మంచి పేరు తేవాలి..! వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు

వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియచేశారు. శనివారం గాంధీ మెడికల్ కాలేజ్ పట్టభద్రుల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న మీకు అభినందనలు అని తెలియజేస్తూ.. మీకు మూడు శుభవార్త చెప్పదల్చుకున్నాను. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్ ఇవ్వబోతున్నాం. పల్లె దవాఖానాలు, పీహెచ్ సీలు, బస్తీ దవాఖానాల్లో పని చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నాం..అని తెలిపారు.

పల్లె దవాఖాన్ ,బస్తి దవాఖాన్ లో ,పిహెచ్ సి లు పని చేయడానికి ముందుకు రావాలని కోరుకుతూ.. పేదలకు సేవ చేసే అదృష్టం కలుగుతుంది.. అని తెలుపుతూ..”ఈ దవాఖానా ల్లో పని చేసే వారికి ఈ అకాడమిక్ లోనే 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ప్రయివేటు, ప్రభుత్వ కళాశాల్లో రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాం. 200 డాక్టర్లు ఈ సంవత్సరం పీజీ లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వ ధవాఖాన లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పీజీ సీట్స్ కూడా పెంచినం, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు ప్రభుత్వ రంగంలో 570 పీజీ సీట్లు ఉన్నయి. ఈ అకాడమిక్ ఇయర్ నుండి పీజీ సీట్ల సంఖ్య 1212కు పెంచనున్నం. ఏడేళ్లలో డబుల్ సీట్లు పెంచాం. ఈ అకాడమీ కి ఇయర్ లో మరో 200 పీజీ సీట్లు పెంచనున్నాం . ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరుగుతాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా సీట్లు పెరగలేదు. ప్రభుత్వ సెక్టార్ లో చూస్తే 60 శాతం విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానలో పీజీ లుకు అవకాశం ఇస్తున్నాం. 2007 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా గాంధీ మెడికల్ కాలేజికి వచ్చి మాట్లాడాను. తెలంగాణ రాష్ట్రంలో రెండే ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నయి. ప్రభుత్వ మెడికల్ కాలేజి ఏర్పాటు చేయలేదు. 200 ఏళ్లక్రితం గాంధీ మెడికల్ కాలేజి బ్రిటిష్ సైన్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఉస్మానియా 100 సంవత్సరాలు క్రితం,గాంధీ బ్రీటిష్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ ,నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. కోస్తా ఆంధ్రలో జిల్లాకో మెడికల్ కాలేజి ఉందని ఆనాడు ఉద్యమంలో ఫైట్ చేశాం.

70 సంవత్సరాలలో 3 కాలేజ్ లో మాత్రమే ఉన్నాయ్ తెలంగాణలో. మూడు ను 33 కళాశాలలు తెచ్చారు మన సీఎం . రాష్ట్రం ఏర్పడ్డ రోజు 700 మెడికల్ సీట్లు ఉంటే ఈ విద్యాసంవత్సరం నుండి 2840 కు సీట్లు పెంచుకోగలుగుతున్నం…వచ్చే రెండు మూడేళ్లోలో ఒక్క ప్రభుత్వ రంగంలో మన తెలంగాణలో 5240 ఎంబీబీఎస్ సీట్లను పెంచుకోబోతున్నాం. పేదలకు విద్య,వైద్యం అందుబాటులోకి రావాలని సీఎం ఆకాంక్ష…మీరు ఉక్రెయిన్ కు,రష్యా కు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవల్సిన అవసరం లేదు. తెలంగాణ రావడంవల్ల మీకు అవకాశాలు వస్తున్నయి…మీరు పీజీ లు కంప్లీట్ అయ్యే వరకు వరంగల్ హెల్త్ సిటీ ,సూపర్ స్పెషలాటి హాస్పిటల్స్ పూర్తి అవుతాయి,మీకు ఉద్యోగా లు కూడా సిద్ధంగా ఉంటాయి ..హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నయి. మీరు పీజీ కంప్లీట్ చేసే సరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు పూర్తవుతాయి.

మీరు చేసేది ఉద్యోగం కాదు. ఉద్యోగం అంటే మీ కుటుంబానికి, మీరు పని చేసే సంస్థకు లాభం కలిగేది .కాని మీరు చేసేది వృత్తి. వైద్యులు, జర్నలిస్టులు, లాయర్లు వృత్తి పనిలో ఉండేవారు. మీరు సేవ చేస్తున్నారు. అర్థరాత్రి అవసరం అయినా పని చేయాల్సి ఉంటుంది. మీరు తెల్ల కోర్టు వేసుకుని చేసిన ఒట్టును గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. ఎధికల్ గా మనం ఉండాలి. అప్పుడే ఈ వృత్తికి గౌరవం. ప్రభుత్వ దవాఖానా లు ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది కానీ,మనసుకు గాయం చేస్తున్నారు కొంత మంది వైద్యులు. బాగా మాట్లాడండి…మీరు ప్రేమగా ,ఆప్యాయతగా మాట్లాడితే రోగం సగం తగ్గుతుంది. మనసును ఉల్లాసపరచగలిగితే రోగం సగం తగ్గిపోతుంది. రోగిని ఆప్యాయంగా పలుకరించండి. గాంధీ హాస్పిటల్ పూర్వ విద్యార్థులకు ఒక్క విజ్ఙప్తి చేస్తున్న.. మీ కాలేజ్ కి ఎంతో కొంత సేవ చేయండి,మీ హాస్పిటల్ కి ఏమైనా సహాయం చేయండి . తిరిగి మీసహకారం కాలేజికి అందించండి. వసతుల కల్పనకు ముందుకు రావాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో రీసెర్చ్ కోసం 10 కోట్ల రూపాయలు కెటయించడం జరిగింది. మన తెలంగాణరాష్ట్రం నుండి గొప్ప ఆవిష్కరణలు బయటకు రావాలి. కాలేజీలను పెంచడానికి , బలోపేతం చేయడానికి, కాలేజీల గౌరవం పెంచడానికి కృషి చేస్తాం. మన గాంధీ మెడికల్ కాలేజికి, ఉస్మానియా మెడికల్ కాలేజీలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది..వైద్యులుగా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురండి.. అని పేర్కొంటూ..మెరిట్ విద్యార్థులకు మంత్రి గోల్డ్ మెడల్ అందించారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎర్పాటు తర్వాత మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేట్ ల ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డి ఎమ్ ఈ ,గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి ,కాళోజి నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విసి కరుణాకర్ రెడ్డి ,గాంధీ హాస్పిటల్ సూపర్ టెండెంట్ రాజారావు , Tsmsidc చైర్మన్ Dr. ఏర్రోల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page