హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14 : పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లే అని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకం అని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యత ఉందన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు కూడా నిధులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు ఆర్థిక సాయం చేయాలన్నారు. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నారు.
జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు మంజూరు, అప్‌గ్రేడేషన్ చేయాలన్నారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలని సూచించారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి బ్జడెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని సూచించారు. ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఎనిమిదేండ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని కేటీఆర్ తెలిపారు.