రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయింది 

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:   రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయిందని, తెలంగాణ లో బిజేపి ప్రభుత్వం రావాల్సిన అవసరం వుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు.బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అమలు కానీ హామీలు నమ్మి ఓటేయ్యొద్దనీ
 కేంద్ర నిధులు తెచ్చి నేనే ఉప్పల్ అభివృద్ధి చేస్తానని   ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలోని పలు కాలనీలలో పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ  ఉప్పల్ గడ్డ.. నా అడ్డా! నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నా ఉప్పల్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వారికి కష్టం ఇంటి గుమ్మం దాకా రాకుండా కాపాడుకుంటా…ప్రజలే నాకు దేవుళ్లు. వారి సేవ కోసమే నేనున్నదని ప్రభాకర్ చెప్పారు.‌ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో నిరంతరం కృషి చేస్తానన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు కొత్త అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేయిస్తానని ప్రభాకర్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఉప్పల్ లో ఆహ్లాదకరమైన వాతావరణం  ఏర్పడేలా మౌలిక సదుపాయాల కల్పన చేపడతామన్నారు. స్వచ్చమైన కాలనీలుగా తీర్చి దిద్దుతానన్నారు.కొత్త అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం తో ఆరోగ్యవంతమైన ఉప్పల్ ఏర్పడుతుందన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధి ప్రాంతాలలో కొత్త డ్రెయినేజీ విధానం నిర్మాణం కావాలంటే కనీసం వెయ్యి కోట్లు అవసరమౌతాయి. వాటిని కేంద్రం నుంచి సాధించి ఉప్పల్ రూపురేఖలు మార్చే బాధ్యత నాదీ అని ప్రభాకర్ హామీ ఇస్తున్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుపోయిందని, తెలంగాణ లో బిజేపి ప్రభుత్వం రావాల్సిన అవసరం వుందని ప్రభాకర్ అన్నారు. కేంద్రం లో, అనేక రాష్ట్రాలలో బి జె పి స్వచ్చమైన పాలన అందిస్తుందన్నారు. తెలంగాణ లో బిజేపి ప్రభుత్వం వస్తే అవినీతికి ఆస్కారం లేని స్వచ్చమైన పాలన ప్రజలకు అందుతుందన్నారు. అంతేకాకుండా పన్నుల మోత తప్పుతుందన్నారు. తెలంగాణ లో బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పన్నులను పెంచి ప్రజలను పీడిస్తోందని విమర్శించారు. తెలంగాణ కు బిఆర్ఎస్ పీడ పోవాలని ,జిహెఎంసి ఎన్నికలలో ఉచితంగా మంచినీటిని అందిస్తామని బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు విపరీతంగా పెంచి, పేదలకు ఆర్టీసీ ప్రయాణం భారం చేశారని అన్నారు. విద్యుత్ విషయంలో దొడ్డి దారిన సర్వీసు ఛార్జీలు వడ్డిస్తూ, విద్యుత్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారని ప్రభాకర్ ప్రజలకు వివరిస్తూ గడపగడపకూ ప్రచారం సాగిస్తున్నారు.
ఎలాంటి అవినీతి లేని స్వచ్చమైన పాలన అందించే సమర్థత నాకే ఉందని ప్రభాకర్అన్నారు. ప్రజలు  ఓటు వేసే సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని‌ కోరారు.   చిల్కానగర్ డివిజన్ లోని మండే మార్కెట్ ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం  బీరప్ప గడ్డ, ప్రశాంత్ నగర్, బ్యాంక్ కాలనీ, ఇందిరా నగర్, అంబేద్కర్ నగర్ ,కళ్యాణ్ పూరి, లో ప్రభాకర్ పాదయాత్ర చేపట్డారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, మాటలు నమ్మి ఆ పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి శూన్యం అవుతుందన్నారు. అనంతరం రామంతపూర్ డివిజన్ లో రామ్ శంకర్ నగర్ లో ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీ వాణి  వెంకట్రావు తో కలిసి ప్రచార నిర్వహించారు.
 పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page