- మునుగోడు వ్యవహారం నాతో చర్చించడం లేదు
- నన్ను పార్టీ నుంచి పంపించాలన్న కుట్ర జరగుతోంది
- తనను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు
- మీడియాతో ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మునుగోడు విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై గుర్రుగా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ దగ్గరనే తేల్చు కుంటానని ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర నాయకత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్దం కొనసాగుతోంది. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మారిన సకరణాలతో.. అధిష్ఠానం ఆయనను పక్కకుపెట్టినట్టు కనిపిస్తోంది. శనివారం నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వరకు సాగనున్న పాదయాత్రకు పిలుపు రాకపోవటం.. మునుగోడు ఉపఎన్నికల టింగ్ గురించి సమాచారం లేకపోవటం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే.. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. తనను పట్టించుకోకపోవటం.. చండూరు సభలో తనకు జరిగిన అవమానంపై కోమటిరెడ్డి వెంకట్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్ చేసిన ’పార్టీలో ప్రాంఛైజీ రాజకీయం’ ఆరోపణలను ఉటంకిస్తూ.. అధిష్ఠానంపై ఉన్న అక్కసును డియా ముందు వెళ్లగక్కారు. చండూరు సభలో జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న వెంకట్‌రెడ్డి.. నాయకత్వం నుంచి ఎలాంటి బుజ్జగింపు లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. సభల గురించి సమాచారం లేకపోవటం.. సభల్లో తిట్టినా పట్టించుకోకపోవటం.. వంటి పరిణామాలన్నింటి వెనుక పీసీసీ అధ్యక్షుడు రేవంత్?రెడ్డి ఉన్నట్టు పరోక్షంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో .పాదయాత్ర గురించి గాంధీభవన్ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదంటున్న కోమటిరెడ్డి.. పిలవని పేరంటానికి తాను వెళ్లనని తెగేసి చెబుతున్నారు. తనకు జరిగిన అవమానంపై సంబంధిత నాయకత్వం క్షమాపణలు చెబితేనే.. ప్రచారంలో పాల్గొనటంపై ఆలోచిస్తానన్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలపై నేరుగా దిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ వద్దనే తేల్చుకుంటానని చెబుతున్నారు.
’మునుగోడు ఉపఎన్నికల టింగ్ సమాచారం నాకు లేదు. పిలువని పేరంటానికి నేను వెళ్లను. మునుగోడు గురించి నాకు ఏం తెల్వదు. మేము కానిస్టేబుళ్లమని అవమానించారు. మమ్మల్ని అవమానించిన వారు క్షమాపణ చెప్పాలి. రేపటి కాంగ్రెస్ పాదయాత్రకు కూడా నన్ను ఎవరూ పిలువలేదు. చండూరు సభలో ఓ కార్యకర్తతో నన్ను తిట్టించారు. అక్కడే అతన్ని లాగిపెట్టి కొట్టాల్సింది. నాలాంటి సీనియర్‌ను తిట్టిన అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తిట్టించిన వాళ్లు క్షమాపణ చెప్పాలి. అప్పుడు మాత్రమే అక్కడ ప్రచారంపై ఆలోచన చేస్తా.నని అన్నారు. దాసోజు శ్రవణ్ చెప్పినట్టు.. పార్టీలో ప్రాంఛైజీ నడుస్తోంది. ఈ విషయమై దిల్లీలో రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డియాతో మాట్లాడారు. ఏ టింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని టింగ్‌కు నేను ఎందుకు వెళ్తా. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. నన్ను అవమానిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతాను అనుకున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు. అన్ని విషయాలు సోనియా, రాహుల్‌తో మాట్లాడతా. ఉప ఎన్నిక వస్తుంది కాబట్టే కేసీఆర్ కొత్త పెన్షన్లు ఇస్తున్నారు’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.