చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న యాత్ర
న్యూదిల్లీ, ఫిబ్రవరి 12 : రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్ మార్పుకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. అయితే నెక్ట్స్ వీక్ నుంచి అక్కడ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో యాత్రను ముందుగానే ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 26 వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21కే ముగిసేలా రాహుల్ మార్పులు చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ ఓ ప్రకటనలో వెల్లడిరచారు. రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆయన గుర్తుచేశారుఫిబ్రవరి 16న వారణాసి మీదుగా యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. అనంతరం భదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఈ నెల 19న అమేఠీకి చేరుకుంటుంది. ఆ నియోజకవర్గంలోని గౌరీగంజ్ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు రాయ్‌బరేలీకి చేరుకుని.. అక్కడి నుంచి లఖ్‌నవూలో రాహుల్‌తో సహా మార్చ్‌లో పాల్గొంటారు. 21న కాన్పూర్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు రaాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌లోకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి.