డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా
ముంబై, జూన్ 28 : టెలికాం దిగ్గజం రిలయెన్స్ జియో డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. దీనికి బోర్డు మంగళవారం ఆమోద ముద్ర వేసింది. జూన్ 27వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖేష్ జూన్ 27వ తేదీన అంబానీ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. 2022, జూన్ 27వ తేదీ నుంచి డైరెక్టర్ లుగా రందర్ సింగ్, కేవీ చౌదరిగా కొనసాగనున్నారు. ఇందుకు షేర్ హోల్డర్స్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. వీరి పదవికాలం ఐదేళ్లు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లుగా పంకజ్ మోహన్ పవార్ నియామకాన్ని బోర్డు ఆమోదించింది. 2021లో నాయకత్వ మార్పుల్లో భాగంగా తన పిల్లలు బాధ్యతలు తీసుకుంటారని గతంలో అంబానీ చెప్పారు. రిలయన్స్ వ్యవస్థాపకుడైన ధీరుభాయ్ అంబానీ దేశాభివృద్దికి దోహదపడ్డారని.. తన పిల్లలు కూడా అదే విధంగా వ్యవహరిస్తారన్నారు.
2019లో జియో ప్లాట్ ఫారమ్ స్థాపించబడ్డాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నులో ఒకరైన ముకేష్ అంబానీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 2002లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా ముకేష్ బాధ్యతలు చేపట్టారు. తన సామాజ్రాన్ని వారసుల చేతుల్లోకి వ్యాపార పగ్గాలు అప్పగిస్తారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో ముఖేష్ అంబానీ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. యంగ్ జనరేషన్ ను సీనియర్లు గైడ్ చేయనున్నారు. త్వరలోనే నాయకత్వ మార్పు ఉంటుందని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. రిలయెన్స్ ఇండస్ట్రీస్ నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత ముఖేష్ కే దక్కుతుంది. కంపెనీని విస్తరిస్తూ.. ప్రతి అడుగుల్లో విజయాన్ని అందుకుంటూ.. అతిపెద్ద సామ్రాజ్యాన్ని సృష్టంచాడు. చాలా వ్యాపారాల్లో సత్తా చాటుతూ.. ముందుకు వెళుతున్నారు. వారసులను నేరుగా రంగంలోకి దింపి..వాళ్లు వ్యాపారం ఎలా నడుపుతారో చూడాలని ముఖేష్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే నాయకత్వాన్ని బదిలీ చేస్తున్నట్లు సమాచారం.