వేధింపులు తట్టుకోలేక రైలుకిందపడి ఆత్మహత్య
రాజమండ్రి, జూన్ 28 : రుణయాప్ ఆగడాలు తట్టుకోలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడడు. ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. కడియంకు చెందిన కోనా సతీష్(28) లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే రుణం చెల్లిం చాలంటూ యువకుడిపై యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకువచ్చారు.
యువకుడిని మానసికంగా తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. చివరకు నగ్నంగా ఉన్న వేరే ఫోటోకు సతీష్ తలతో ఉన్న ఫోటో అతికించి స్నేహితుల వాట్సాప్ నంబర్లకు షేర్ చేసి ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సతీష్ ఈనెల 24న భీమవరం సపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా అప్పు చెల్లించాలంటూ ఈనెల 26 నుంచి కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్ మెసేజ్‌లు పంపుతూ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు.
అప్పు చెల్లించలేకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వాట్సాప్‌లో అందరికీ షేర్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు కడియం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.