- పదిహేనేళ్ల బాలిక పై అత్యాచారం…ఆపై హత్య.
- చట్టాలెన్నున్నా…రక్షణ సున్నా
- ఆడపిల్లలపై ఆగని అరాచకాలు
- ఉరి శిక్షే సరైన శిక్ష అంటున్న మహిళలు
పరిగి, మార్చి 28(ప్రజాతంత్ర విలేఖరి) : చట్టాలెన్ని వొచ్చినా మహిళలు, ఆడపిల్లల పట్ల అగాయిత్యాలు ఆగడం లేవు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నామని చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆడ పిల్లల పట్ల దాడులు ఆగడం లేదు. మదమెక్కి మానవ మృగాలు ఆడపిల్లల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ మాన..ప్రాణాలను సైతం హరించేందుకు వెనుకాడడం లేదు. పరిగి నియోజక వర్గం పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో పదిహేనేళ్ల ను హత్య చేశారు. అయితే అత్యాచారం చేసి ఆపై హత్యగావింబడినట్లు అనుమానిసున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పూడూరు మండలం అంగడి చిట్టెం పల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక బహిర్భూమికి వెళ్లి ఎంతకూ తిరిగి రాకపోవడంతో మృతురాలి తల్లి లక్ష్మి వెళ్లి చూడగా అక్కడ విగత జీవిగా పడి ఉన్న తన కూతురిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన మహేందర్(నాని)అనే యువకునిపై అనుమానం ఉన్నట్టు తెలపగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి సందర్శించి పరిశీలించడం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిందితుల పట్ల చట్ట పరంగా చర్యలు చేపట్టి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.