ప్రముఖ సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత,
కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున హైదరబాద్ లో కన్ను మూసారు. సినీ నటుడిగా కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు పొందారు.
నర్సాపురం లోక్ సభ్యునిగా బిజేపీ నుంచి ఎన్నికయిన కృష్ణం రాజు అప్పటి ప్రధాన మంత్రి వాజ్ పాయ్ మంత్రి మండలి లో సహాయ మంత్రి గా పని చేసారు.
కేంద్ర మాజీ మంత్రి సీ హెచ్ విద్యాసాగర్ రావు సంతాపం..
సినీ ప్రేక్షకుల హృదయాల్లో ‘రెబల్ స్టార్’ గా చిరస్థాయిగా అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం బీజేపీకి, తెలుగు ప్రజలతోపాటు వెండితెరకు తీరని లోటు.. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా..అని కేంద్ర మాజీ మంత్రి సీ హెచ్ విద్యాసాగర్ రావు సంతాపం తెలియ జేసారు.