‌రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలి

  • తస్మాత్‌ ‌జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం
  •  మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌  ‌బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం సభలో మంత్రి హరీష్‌ ‌రావు

నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌కేసీఆర్‌ అం‌టే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిండు సీఎం కేసీఆర్‌.. ‌తెలంగాణ వచ్చాకే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆదివారం మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్‌ ‌రెడ్డిదే.. మదన్‌ ‌రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్‌ ఇస్తున్నారని మేము చెప్పాం.  కర్ణాటక లో 5 గంటలే కరెంట్‌ ఇస్తున్నామని నిన్న డీకే శివకుమార్‌ ‌నిజాలు చెప్పారు..  కానీ 5 గంటలు ఇవ్వట్లేదు 3 గంటలే ఇస్తుంది. డీకే శివకుమార్‌ ‌మాటలతో కాంగ్రెస్‌ ‌పార్టీ సమాధి కట్టుకుంది.. డీకే శివకుమార్‌ ‌కి థాంక్స్ ‌చెబుతున్న అని ఆయన తెలిపారు.

నువ్వే 5 గంటలు కరెంట్‌ ఇస్తున్నామని చెప్పావ్‌..  ఇం‌కా బస్సెందుకు మాకు కర్ణాటక రావడానికి.. డీకేనే నిజాలు చెప్పారు కదా.. కర్ణాటక మోడల్‌ ‌ఫెయిల్యూర్‌ ‌మోడల్‌ అని మంత్రి అన్నారు.  రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ ‌వాళ్ళకి సిగ్గు లేదు.. రేవంత్‌ ‌మూడు గంటల కరెంట్‌ ‌చాలు అంటాడు.  డీకే శివకుమార్‌ ఐదు గంటల కరెంట్‌ ఇస్తున్నామని అంటాడు..  రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలి.  తస్మాత్‌ ‌జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం.. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓటు వేయడు..  కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓటేస్తే మన కళ్ళను మనం పొడుచుకున్నట్టే.. కాంగ్రెస్‌ అన్నీ అబద్ధాలు చెబుతుంది. కాంగ్రెస్‌ ‌వాళ్లు బట్టేబాజ్‌ ‌గాళ్ళు.. వాళ్ళవి తిట్లు…మనవి కిట్లు.. కాంగ్రెస్‌ ‌బూతులు కావాలా…తెలంగాణ భవిష్యత్తు కావాలా అని మంత్రి హరీష్‌ ‌రావు ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్‌ ‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page