రైతు బంధు నిధుల దారి మళ్లింపు

7 వేల కోట్లు రుణ మాఫీకి మళ్లించారని కెటిఆర్‌ ఆరోపణ కెటిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రుణ మాఫీ పేరిట రేవంత్‌ ‌సర్కార్‌ ‌మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా పోస్టు చేశారు. రైతు బంధు కింద జూన్‌ ‌నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే రూ.7000 కోట్లు రుణ మాఫీకి దారి మళ్లించారని ఆరోపించారు. రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిల్చి రుణ మాఫీ చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు.

40 లక్షల మందికి పైగా రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత కల్పించారన్నారు. 2014లోనే కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించిందని..సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందని తెలిపారు.

2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలుగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టోలో హావి• ఇచ్చినట్లు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలన్నారు. అర్హులైన అందరికీ రైతు బంధు విడుదల చేయాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page