రైతు రుణ మాఫీలో ఆలస్యం సరికాదు

వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నముక
ప్రభుత్వ ఆశయం మేరకు బ్యాంకర్లు సహకరించాలి
బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి సూచనలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రైతు రుణాల మాఫీలో వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ ‌చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు. గ్రావి•ణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం రాష్టాన్రికి వెన్నెముకగా భావిస్తామన్నారు. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని భట్టి తెలిపారు. ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామన్నారు. రెండు లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని.. ఇది వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయని చెప్పుకొచ్చారు.

వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఇన్నోవేటివ్‌ ‌పాలసీలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ. 36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని.. వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడాలని బ్యాంకర్లకు సూచించారు భట్టి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. మొదటి క్వార్టర్‌లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులు ఇప్పటివరకు 40.62? వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి మొదటి క్వార్టర్‌లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశం అని అన్నారు.

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్టాల్ల్రో తెలంగాణ ఒకటి అని.. ఇతర రాష్టాల్ర కంటే తెలంగాణ ముందంజలో ఉండేలా తమ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఉపముఖ్యమంత్రి చెప్పారు. వరి ఉత్పత్తిలో పెరుగుదల అంశం.. ఎఫ్‌సీఐకి వరిని సరఫరా చేసే రాష్టాల్ల్రో ప్రధాన రాష్ట్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. రాబోయే తైమ్రాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి 36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుంది. వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించండి. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నాం. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి చేయండి. 20 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌ ‌లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నాను.

మొదటి క్వార్టర్‌ ‌లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62శాతం వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం. రాష్ట్రం యొక్క నగదు నిల్వలనిష్పత్తి మొదటి క్వార్టర్లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశం. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ది చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ ఏడాది దేవుడి దయతో వర్షాలు పుష్కలంగా పడుతున్నాయని మంత్రి తుమ్మల అన్నారు. ఈ సంవత్సరం అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద రూ.18వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని తుమ్మల చెప్పుకొచ్చారు.

కొంత మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని, అందుకు రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పారు. వాంటన్నింటినీ త్వరలోనే పరిష్కరించి రైతులకు తోడుగా నిలవాలని బ్యాంకర్లకు మంత్రి సూచించారు. నగదు జమ కాని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని మంత్రి చెప్పుకొచ్చారు.గ్రామస్థాయిలో పని చేసే బ్యాంకుల బ్రాంచ్‌ ‌మేనేజర్లను రైతుల రుణ ఖాతాల్లో తప్పులు సరిదిద్దేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను మంత్రి తుమ్మల కోరారు. రుణ మాఫీ చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని బాధ్యత బ్యాంకర్ల ఉందన్నారు. అంకెలు చదువుకోవడానికి ప్రతి మూడు నెలలకోసారి వి•టింగులు, బ్యాంకర్ల సదస్సు నిర్వహించడంలో అర్థం లేదని తుమ్మల పేర్కొన్నారు. రైతులు, పేదలు, నిమ్నవర్గాల ప్రజలకు పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు అందేలా చేయడంలో కీలకంగా వ్యవరించాలని మంత్రి తుమ్మల బ్యాంకర్లను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page