రైతు సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 
 రైతు సంక్షేమం అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం  వికారాబాద్ జిల్లా మార్పల్లి  మండలం  వ్యవసాయ మార్కెట్ యార్డ్  నూతన  వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్  పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రైతు రుణ మాఫీ, ఆరు గ్యారంటీ ల స్కీం లను  ప్రతి ఒక్కరికి అందించడం ప్రభుత్వ లక్ష్య మన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చేయగలుగుతున్నమ్మన్నారు. మార్కెట్ కమిటీకి ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని ప్రభుత్వానికి మార్కెట్ కు రైతులకు మంచి పేరు వొచ్చేలాగా మార్కెట్ కమిటీ కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి   మాట్లాడుతూ దేశానికి వెన్నెముక లాంటి రైతులకు సేవ చేసే అవకాశం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు  వొచ్చిందని, నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యతగా పనిచేసి రైతులకు సేవ చేసుకోవాలని తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని  తెలిపారు.  రైతుల సంక్షేమం కోసం రైతాంగానికి చేయాల్సిన అన్ని పనులను తమ ప్రభుత్వం అందజేస్తుందని, రైతుల రుణమాఫీలో వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జమ చేయడం జరిగిందని  ఇంకా రుణమాఫీ కానీ రైతులకు  రుణమాఫీ నిధులను వారి అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. అదే విధంగా 2 లక్షలు కన్నా పైన రుణాలు తీసుకున్న వారికి కూడా ప్రణాళిక ప్రకారం  ఎవరెవరికి ఎప్పుడు రుణమాఫీ నిధులు జమ చేయాలో ముందే తెలియజేస్తామని  మంత్రి తెలిపారు .పంటల భీమా, రైతు భరోసా సైతం తమ ప్రభుత్వం ఇస్తుందని  తెలిపారు. రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఆరు గ్యారెంటీ లతోపాటు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు.
భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ తోటలకు మంచి డిమాండ్ ఉందని జిల్లాలో ఈ సంవత్సరం ఆయిల్ ఫామ్  తోటలు సాగు చేయాలనీ అయిల్  పాం పంట వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని అంతర పంటలు సాగు చేసుకుని లాభం పొందవొచ్చు అని ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయల సబ్సిడీ సైతం ఇస్తుందని మంత్రి తెలిపారు.  బ్యాంకు  తప్పులను సరిచేసి 4 లక్షల మందికి ఈ నెలాఖరు వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల ను అభివృద్ధి లోకి తీసుకురావడమే  ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల తాండూరు పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య బి మనోహర్ రెడ్డి టి.రాంమోహన్ రెడ్డి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులు మర్పల్లి మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వై. మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ జి మల్లేశ్ యాదవ్ మరియు పాలకవర్గ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page