ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బాలాజీ నగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల పట్టణంలో జంబుల రంగనాయకమ్మ పార్కులో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి. బాబురావు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్. సునీల్ కుమార్, మల్టిపుల్ చైర్ పర్సన్ మోహన్ రావు, ఎల్ సి ఎఫ్ చైర్మన్ ఎస్. నరేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఎల్సిఐఎఫ్ ఏరియా లీడర్ జి. చిన్న కిషన్ రెడ్డి తో కలిసి జంబుల రంగనాయకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జంబుల రంగనాయకమ్మ సేవలను కొనియాడారు. అండర్ సిఎస్ఆర్ ఆ క్టివిటీస్ ఆఫ్ జంబుల రంగనాయకమ్మ ఫ్యామిలీ, ఆర్ ఆర్ గ్రీన్ సిటీ వారి సంయుక్త నిధులతో నిర్మించిన పార్కులో రంగనాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు, సునీల్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు జి. చిన్న కిషన్ రెడ్డి గారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. గ్రామీణ క్లబ్ సేవలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు సేవలు ఆదర్శమని వారన్నారు. లయన్స్ క్లబ్ ఆమనగల్లు జి. చిన్న కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు భూదానంతోపాటు కోట్ల రూపాయలు వేచించి లయన్స్ ఐ హాస్పిటల్ నిర్మించి, రంగనాయక విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆయన స్వచ్ఛందగా సేవలను అందించడం ఎంతో గర్వకారణం అని అన్నారు. అందుకే లయన్స్ క్లబ్ 320 మల్టిపుల్ లోనే ఆయన పితామహులుగా నిలుస్తారని ఆర్. సునీల్ కుమార్ వర్ణించారు. జి చిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్కు కడ్తాల గ్రామానికి ఎంతో అందంగా నిలుస్తుందని క్లబ్ సభ్యుల సహకారాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ జిల్లా గవర్నర్ జూలూరి. రమేష్ బాబు, ఎస్. రాధాకృష్ణ, కోటేశ్వర రావు, ఆర్. మహేందర్ రెడ్డి, ఆర్ సి ప్రభాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేట్ వీరబొమ్మ బిక్షపతి, క్లబ్ అధ్యక్షులు సుద్ద పల్లి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి కొరివి వెంకటయ్య, క్లబ్ పిఆర్ఓ పాషా, కడ్తాల లయన్స్ క్లబ్ సభ్యులు కృష్ణమూర్తి, గంప శ్రీను, వెంకటేష్, రాజేందర్ రెడ్డి, జూలూరి లింగయ్య, కే. రామ్ రెడ్డి, ఓంకారం, మధుసూదన్ రెడ్డి, అంజయ్య, జూలూరి రమేష్, పాండు రెడ్డి, రంగనాయకమ్మ కుటుంబ సభ్యులు లయన్ సుధా చెన్న కిషన్ రెడ్డి, ధీరజ్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.