ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ఆటోనగర్ చుట్టు పక్కల కాలనీ వాసుల ఇబ్బందుల దృష్ట్యా వారి విజ్ఞప్తి మేరకు లారీ అడ్డా ను తాత్కాలికంగా మరొకచోటకు తరలిస్తున్నట్టు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. సహృదయ వాతావరణంలో లారీ యూనియన్ సభ్యులు అంగీకరించారని.. లారీ అడ్డకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి శాశ్వత అడ్డ ఏర్పాటు కు కృషి చేయనున్నట్లు సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆటోనగర్ పరిసర ప్రాంత 21 కాలనీ సంఘాలు, లారీ అడ్డ యూనియన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మూకు మ్మడిగా ఇసుక లారిల అడ్డాను తొలగించి తమకు సహకరిం చాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఖచ్చితంగా లారీల అడ్డా వేరొక చోటుకు తరలించినట్లు చెప్పా రు. ఈ లారీల అడ్డా వల్ల చుట్టూ పక్కల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, మానవతా దృక్పధం తో లారీల అడ్డా తొలగింపునకు సహకరించాలని, తాత్కాలి కంగా టీ ఎస్ ఐ ఐ సి నిబంధనలకు కట్టుబడి వారికి సౌకర్యవంతమైన స్థలానికి లారీల అడ్డా మార్చబడుతుంద న్నారు. ప్రాధమికంగా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా తగు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్ అవతల ఇసుక లారీలకు శాశ్వత స్థలం ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇసుక లారీల అసోసియేషన్ సంఘం సభ్యులు కూడా అంగీకారం తెలిపారని.. రాజకీయ ప్రత్యర్ధులు ఎన్ని రాజకీయాలు చేసిన, అపోహలను నమ్మవద్దని కోరారు. అభివృద్ది ఆపలేరని..ఇప్పటి వరకు చెప్పిన పెద్ద పెద్ద సమస్యలను పరిష్కారించానని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ అనంత రెడ్డి, డీసిపి లు సాయి శ్రీ, శ్రీనివాస్, ఆర్ టీ ఏ రఘునందన్, మాజీ కార్పొరే టర్ తిరుమల్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్, నక్క రవీందర్ గౌడ్, ఏసిపి లు భీంరెడ్డి, నవీన్ రెడ్డి, సీఐ జలేందర్ రెడ్డి ,లారీ అసోసియేషన్ సభ్యులు నందారెడ్డి,యాదగిరి,రాంరెడ్డి, జగదీష్,శ్రావణ్,లక్ష్మణ్ రెడ్డి,శ్రీనివాస్,సుదర్శన్ రెడ్డి,జలందర్ రెడ్డి, సుధాకర్, ప్రవీణ్ గౌడ్, సత్తిరెడ్డి, కృష్ణారెడ్డి, గుజ్జ జగన్ మోహన్ వివిధ విభాగాల అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.