మల్కాజిగిరి దక్కించుకున్న ఈటల రాజేందర్ పార్టీలో చేరిన బీబీ పాటిల్, భరత్‌లకు చోటు
న్యూదిల్లీ, మార్చి 2 : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించగా ముగ్గురు సిట్టింగ్ ఎంపిలకు తిరిగి అవే స్థానాలు దక్కాయి. ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి సీటు దక్కించుకున్నారు. మెదక్‌పై రఘునందన్ రావు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢల్లీిలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేయనున్నట్లు వినోద్ తావ్‌డే పేర్కొన్నారు. 195 లోక్‌సభ స్థానాలకు తొలి జాబితా ప్రకటించిన బీజేపీ.. ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మందికి అవకాశం దక్కింది.

ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అవకాశం కల్పించింది. మల్కాజ్‌గిరి నుంచి ఈటెల రాజేందర్, హైదరాబాద్ మాధవీలత, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్, జహీరాబాద్ బీబీ పాటిల్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించింది. భరత్ ప్రసాద్ ఎంపి రాములు తనయుడు. బిబి పాటిల్ నిన్ననే బిజెపిలో చేరారు.
195 మందితో బిజెపి తొలి జాబితా
వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా
న్యూదిల్లీ, మార్చి 2 : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థుల మొదటి జాబితాలో తెలంగాణ నుండి ముగ్గురు సిట్టింగ్‌లతో సహా 9 మంది చోటు దక్కించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అమిత్‌షా గుజరాత్ గాంధీనగర్ నుంచి, సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సుర స్వరాజ్ న్యూ దిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎంపిలకు తిరిగి అవే స్థానాలు దక్కాయి. కాగా ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి సీటు దక్కించుకున్నారు. మెదక్‌పై రఘునందన్ రావు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను దిల్లీలో విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. వొచ్చే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేయనున్నట్లు వినోద్ తావ్‌డే పేర్కొన్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు తిరిగి అవకాశం కల్పించింది.
మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, హైదరాబాద్ మాధవీలత, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్, జహీరాబాద్ బీబీ పాటిల్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించింది. భరత్ ప్రసాద్ ఎంపి రాములు తనయుడు. బిబి పాటిల్ నిన్ననే బిజెపిలో చేరారు. ఇక దేశం వ్యాప్తంగా 34 మంది కేంద్ర మంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేతలు ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే విడుదల చేశారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 195 స్థానాలకు అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విూటింగ్‌లో ఖరారు చేసినట్టు తావడే తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువకులు, 18 గిరిజన తెగల అభ్యర్థులు ఉన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి 26 మంది అభ్యర్థులను ప్రకటించగా, మధ్యప్రదేశ్ నుంచి 24 స్థానాలు, గుజరాత్ నుంచి 15 స్థానాలు, రాజస్థాన్`15, కేరళ`12, తెలంగాణ`9 మంది, ఢల్లీి`5, జమ్మూ`2, ఉత్తరాఖండ్`2, గోవా`1, త్రిపుర`1, అండమాన్ 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.