ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెం
బండలేమూరు గ్రామానికి వెళ్లి స్వయాన రైతుల గోడు విన్న రైతుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు.లోయపల్లి, బండలేమూర్,బోడకొండ తండా,ఆరుట్ల,పీసీ తండా,అంబోత్ తండా,పొర్లగడ్డ తండా, గ్రామాల్లోని నిరుపేద రైతులను బెదిరించి రైతుల దగ్గర నుండి 4000 ఎకరాల భూమిని సత్యం రామలింగరాజు,ఆకుల రాజయ్య లాంటి బడా ఆర్థిక నేరగాళ్ల మోసపూరిత మైన మాటలు చెప్పి పట్టాదారులు,సాదాబైనామాలు కల్గి ఉండి కబ్జాలో ఉన్న రైతుల నుండి అక్రమంగా గుంజుకున్న భూములను 2006 సంవత్సరం లో ఈడి జప్తు చేసిందని ఆయన గుర్తు చేశారు.ఈడీ అటాచ్ చేసిన భూములపై లోయపల్లి,బండలేమూర్,ఆరుట్ల పరిధిలోని గ్రామాల రైతులు న్యాయ పోరాటం చేయడం వల్ల 1200 ఎకరాల భూమిని ఈడి రైతుల కోసం రిలీజ్ చేసిందన్నారు.నేడు ఈ భూములపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,అతని కొడుకు ప్రశాంత్ రెడ్డిలు కన్నేసి రౌడీలు,బౌన్సర్లతో కలిసి పోలీసులను అడ్డు పెట్టుకొని నిరుపేద రైతులను వ్యవసాయ భూముల నుండి తరిమికొడుతున్నారని ఆయన ఆరోపించారు.రౌడీలు బౌన్సర్లతో వెళ్లి భూములు కబ్జా చేయడానికి ఎమ్మెల్యే కు ఎమ్మెల్యే కొడుకుకు అధికారం ఎవరిచ్చారు ఆయన ప్రశ్నించారు.పేద రైతుల కొంప ముంచడానికి,పేద రైతుల రక్తం తాగడానికి, గిరిజన తండాలలో చిచ్చు పెట్టడానికేనా ఎమ్మెల్యే ఉన్నట్లు ఉందని మల్ రెడ్డి మండిపడ్డారు.రౌడీలు,బౌన్సర్లను తీసుకొచ్చి పోలీసులను అడ్డం పెట్టుకొని రైతులను తరిమికొట్టి పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని ఎమ్మెల్యేను ఆయన హెచ్చరించారు.రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇక్కడున్న భూములన్ని పేద ప్రజలకు పట్టాలిప్పించే బాధ్యత తానే తీసుకుంటానని ఎవ్వరు కూడా ఇందులో అడుగుపెట్టడానికి వీల్లేదన్నారు ఆయన గద్దించారు.ఇప్పటికే నియోజకవర్గంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కొడుకు దోచుకున్న భూములు చాలా ఉన్నాయి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పక్కకి 700 కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టి బంగారుగనుల్లో పెట్టుబడులు పెడితే ఈడి వచ్చి చెంపలు వాయించింన విషయం మర్చిపొకుడదని ఆయన హితవు పలికాడు.మోసపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఒకవేళ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అతని అనుచరులను మరియు మోసం చేసిన వారిని తరిమికొడతామని హెచ్చరించారు.ఆకుల రాజయ్య సత్యం రామలింగరాజుకు సంబంధించి ఈడీ అటాచ్ చేసిన భూములు ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని పేద రైతులకు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.