వందోరోజుకు లోకేష్‌ ‌పాదయాత్ర

నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
యాత్రలో పాల్గొన్న తల్లి భవనేశ్వరి
హాజరైన పలువురు ఎన్టీఆర్‌ ‌కుటుంబ సభ్యులు

నంద్యాల,మే15 : టీడీపీ యువనేత నారా లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర  వందవ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్‌ ‌సైట్‌ ‌నుంచి లోకేష్‌ ‌పాదయాత్రను ప్రారంభించారు. నేటితో యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోనుంది. మదర్స్‌డే రోజు నారా లోకేష్‌కు తల్లి భువనేశ్వరి సర్‌‌ప్రైజ్‌ ‌గిప్ట్ ఇచ్చారు. పాదయాత్రలో తల్లి భువనేశ్వరి సహా నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పాదయాత్రలో తల్లి భువనేశ్వరి షూకు లోకేష్‌ ‌లేస్‌ ‌కట్టారు. అలాగే నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్‌, ‌నందమూరి మణి, సీహెచ్‌ శ్రీ‌మాన్‌, ‌సీహెచ్‌ ‌చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్‌, ‌కాంటమనేని దీక్షిత, కాంటమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్‌ ‌లోకేష్‌తో కలిసి పాదయాత్రలో నడిచారు. మోతుకూరులో యువగళం పాదయాత్ర 100 రోజుల పైలాన్‌ను లోకేష్‌ ఆవిష్కరించనున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే.ముత్తుకూరు, పెద్ద దేవళాపురం, సంతజూటూరు, పరమటూరు దుగా బండి ఆత్మకూరు వరకు పాదయాత్ర సాగనుంది. సంత జూటూరులో చెంచులతో లోకేష్‌ ‌ముఖాముఖి నిర్వహించనున్నారు.

యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీగా కార్యకర్తలు, అభిమానులతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. జైలోకేష్‌, ‌జై తెలుగుదేశం నినాదాలతో యువగళం పాదయాత్ర మార్గం హోరెత్తుతోంది. పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దాంతో 3 కి.. మేర ట్రాఫిక్‌ ‌స్థంభించింది. బాణాసంచా మోతలు, డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరుతో జాతరను యువగళం తలపిస్తుస్తోంది. ఇప్పటి వరకు లోకేష్‌ 1268.9 ‌కిలోటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు 16.2 కిలోటర్లు పాదయాత్ర చేయనున్నారు. అంతకుముందుకు లోకేష్‌ను తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. 100 రోజుల యాత్ర పూర్తి చేసుకుంటున్న సందర్భంగా క్యాంప్‌ ‌సైట్‌లో లోకేష్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, ‌సీనియర్‌ ‌నేత రావుల చంద్రశేఖరరెడ్డి, మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి, యువత అధ్యక్షడు పొగాకు జైరాం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page