వరంగల్‌ అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌సిద్ధం చేయండి

  • నగర జనాభా దృష్టితో ప్రతిపాదనలు
  • కుడా, సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌వరంగల్‌ ‌పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో తన కార్యాలయ సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్‌ ‌డెవలప్మెంట్‌ అథారిటీ(కుడా) అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో వరంగల్‌ ‌నగర అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్‌ ‌నగరం తర్వాత వరంగల్‌ ‌పట్టణాన్ని విస్తృత పరచడానికి, పలు అభివృద్ధి పనులు చేపట్టాడానికి  తగు మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌సిద్ధం చేసేందుకు గతంలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు.
గతంలో ఉన్న 2041 మాస్టర్‌ ‌ప్లాన్‌ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్‌ ‌ప్లాన్‌లను మంత్రి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ‌పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, ‌రోడ్లు భవనాలు శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, కుడా వైస్‌ ‌చైర్మన్‌, ‌కమిషనర్‌ అశ్విని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌డైరెక్టర్‌ ‌గౌతమ్‌, ‌కుడా సీపీఓ అజిత్‌ ‌రెడ్డి, కన్సల్టెంట్లు, అధికారులు పాల్గొన్నారు.
మైనార్టీలు లక్ష్యంగా బుల్‌డోజ్‌ ‌చర్యలు
అధికార బిజెపిపై మండిపడ్డ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే
 
image.pngన్యూ దిల్లీ, ఆగస్ట్ 24 : ‌బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌ ‌యాక్షన్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే తప్పుపట్టారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, బుల్డోజర్‌ ‌చర్యలతో పౌరుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. ఒక వ్యక్తి ఇంటిని కూల్చేయడం, అతని కుటుంబానికి నిలువ నీడ లేకుండా చేయడం రెండూ కూడా అమానవీయం, అన్యాయమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పదేపదే మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ‘రూల్‌ ఆఫ్‌ ‌లా’ ప్రకారం పాలన సాగే సమాజంలో ఇలాంటి చర్యలకు తావులేదని ఖర్గే సామాజిక మాధ్యమం ’ఎక్స్’‌లో పేర్కొన్నారు. సహజ న్యాయం స్థానంలో అరాచకం చోటు చేసుకోరాదని, నేరాలను పరిష్కరించాల్సింది కోర్టులే కానీ, రాష్ట్ర ప్రభుత్వాల బలప్రయోగాలు కాదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయకపోవడం, బుల్డోజర్‌ ‌చర్యలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ‌నేత హాజి షెహజాద్‌ అలీ బంగ్లాను మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం బుల్డోజర్‌తో కూల్చివేసిన నేపథ్యంలో ఖర్గే తాజా వ్యాఖ్యలు చేశారు. భోపాల్‌లో ఇటీవల పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన ఘటనలో హాజీ షెహజాద్‌ అలీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page