హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరుజల్లులు
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : మిచౌంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడిరచింది. ఈ నేపథ్యంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నారు. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డి పల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూసుమంచి, కారేపల్లి మండలాలతోపాటు పాల్వంచ, తిరుమలాయపాలెంలో జోరుగా వర్షం కురుస్తున్నది. సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్‌ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, మేడ్చల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచించింది. ఎత్తయిన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లతో సవిూక్ష నిర్వహించారు. మంగళవారం, బుధవారం భారీ వర్షం కురుస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట, కత్బుల్లాపూర్, సుచిత్ర, రాయదుర్గం, బహదూర్‌పల్లి, సూరారం, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, బోరబండ, అల్లాపూర్, రహమత్‌నగర్, మధురానగర్, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, మైత్రివనం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, బీఎన్‌రెడ్డిలో వర్షం కురిసింది.
అనేక జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు
చర్యలపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్
చర్యలపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ… రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వొచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్‌కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వొచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వే, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సిఎస్ శాంతి కుమారి సూచించారు.