వరదల సమయంలో ఈ నేతలు నేతలు ఎక్కడ

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 16: ఎన్నికలు రాగనే వచ్చి, పోయే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకురాలుకు ప్రతి ఒక్కరు అండగా ఉండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి విన్నవించారు.మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర  8, 9, 10, 11 వ డివిజన్ లకు సంబంధించి, కార్పొరేటర్, ఏంఏంసి బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ముద్ద పవన్ కుమార్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,  బిఅర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రసంగించారు.  మీర్ పేట్ కాలనీలను బంజారాహిల్స్ కు దీటుగా అన్ని విధాలుగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో గతంలో ఎక్కడ ఎక్కడ చూసిన మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వందల కోట్ల నిధులు తీసుకువచ్చి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లు చెప్పారు. ప్రజలు గతంకు ఇప్పటికి బేరీజు వేసుకుని చూడాలన్నారు. పని చేసే వారిని విస్మరించకుండ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నడు లేని విధంగా గత రెండు ఏళ్ల క్రితం భారీ వర్షాలు వచ్చి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, ఇపుడు పోటీలో ఉన్న నాయకులు ట్రాక్టర్లపై వచ్చి, ఫోటోలోకు పోజులు ఇచ్చారన్నారు. కరోనా సమయంలో, మోకాల లోతు నీళ్ళు వచ్చిన, కష్టాల్లో ఉన్నప్పుడు కనబడని నేతలు, ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారని అలాంటి నాయకులకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఒక నాయకుడు తాండూరులో సీటు అడిగితే, మహేశ్వరంలో ఇచ్చారని, ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు రేపు ఎన్నికలు అయ్యాక కనిపిస్తారన్న నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. చేవెళ్ల, మేడ్చల్ లో చెల్లని రూపాయి మన మహేశ్వరంలో చెల్లుతుందా అంటూ.. ప్రజలను అడుగగా చెల్లదు అంటు వారంతా బదులిచ్చారు. ప్రతి కాలనీ అభివృద్ది, సంక్షేమానికి కృషి చేసానని, మీ అందరి ఆశీర్వాదాలు కావాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400కే వంట గ్యాస్ అందిస్తామన్నారు. రూ.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లను రూ.5 వేలు, రూ.4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ రూ.6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం కింద ప్రతి నెల రూ.3 వేలు అందిస్తామని, రైతు భీమా మాదిరిగా, రాష్టంలోని 93 లక్షల తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గములోని బడంగ్ పేట్, మీర్ పేట్, తుక్కుగూడ, జల్ పల్లి జంట కార్పొరేషన్లు, జంట మున్సిపాలిటీలో  రూ.832 కోట్ల భారీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. జంట కార్పొరేషన్ల పరిధిలో ట్రంక్ లైన్ లైన్లు, నాళాల నిర్మాణాలతో వరద నీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. నాలాల అభివృద్ధికి రూ.110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.280 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు, నూతన పైప్ లైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడల పరిధిలోని రూ.11 చెరువులను రూ.40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.13 బస్తీ దవాఖానలు, 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమని చూసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page