వర్షాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తం

వర్షాకాలం వచ్చేసింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలే అవకాశాలు వున్నాయి.ఇప్పటికే జ్వరాలు,దగ్గు,తుమ్ములు,జలుబు,వివిధ రోగాలతో జనం ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్  ‌చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వున్నారు. రాష్ట్రం లోని అనేక  గ్రామాల్లో, పట్టణాలు,నగరాలలో అపరిశుభ్రత ఎక్కువ  ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమలు,ఈగలు,పందుల సంచారం  వ్యాధులకి కారకాలుగా నిలుస్తూ వున్నాయి.రాస్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో,పట్టణాలు,నగరాలు,గ్రామాలు కంపు కొడుతూ వున్నాయి.పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజు మురుగు,చెత్త ను తొలగించడం జరిగినా కాలువలు,నాలాలు మళ్ళీ  అపరిశుభ్రంగా వుండి దుర్వాసన వెదజల్లుతూ వున్నాయి.

ఈ మధ్య కాలంలో పై స్థాయి సిబ్బంది వారి పర్యవేక్షణ కరువై గ్రామాలలో ,నగరాలు,పట్టణాల్లో డ్రైనేజ్‌ ‌కాలువలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. దీంతో అయా గ్రామాలలోని,పట్టణాల లోని ప్రజలు కాలువలలో చెత్త పేరుకుపోవడం మూలాన దోమల బెడద ఎక్కువై డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వివిధ రోగాలు స్వల్పం గా ప్రభావం చూపుతూ వున్న గ్రామ పంచాయితీ,కార్పొరేషన్‌,‌మునిసిపల్‌  ‌సిబ్బంది ఇలా డ్రైనేజ్‌ ‌కాలువలను తరచుగా శుభ్రపరచకుండా వదిలివేయడం సమంజసం కాదు. డ్రైనేజ్‌ ‌కాలువల విషయం లో ఎందుకు  వీరు ఇంత   నిర్లక్ష్యంగా వున్నారని ప్రజలు నిలదీస్తే తమకు గత కొంత కాలంగా జీతాలు ఇవ్వడం లేదని, చాలీ చాలని వేతనాల తో పూట గడవడం కష్టంగా మారింది అనే డొంక తిరుగుడు సమాధానం వారి నుంచి వస్తున్నది తప్ప డ్రైనేజ్‌ ‌కాలువలను త్వరితగతిన శుభ్రం చేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అనే చిత్తశుద్ధి వారిలో ఏ మాత్రం కానరావడం లేదు.

ఇక ఖాలీ  స్థలాలలో గుట్టలు, గుట్టలుగా పెరిగిపోయిన ముళ్ల పొదల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ ముళ్ల పొదల మూలాన  గృహస్తులకు పాముల బెడద ఎక్కువగా ఉంటుంది అని తెలిసినప్పటికీ పై స్థాయి అధికారులలో ఏమాత్రం చలనం ఉండటం లేదు. ఈ విషయం లో ఎన్నిమార్లు ప్రజలు గ్రామ పంచాయితీ సిబ్బందికి మొర పెట్టినా అవి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతున్నాయి తప్ప ఫలితం ఏమాత్రం కానరావడం లేదు.. దీంతో గ్రామ,పట్టణ ప్రజలు చేసేదేమి లేక తీవ్ర అసహనానికి గురి అవుతూ అపరిశుభ్ర వాతావరణం తోనే సావాసం చేస్తూ వున్నారు.

ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుండటం ఏ మాత్రం భావ్యమో గ్రామ పంచాయితీ,పట్టణ ప్రాంతాల్లో పని చేసే వారెకే,వారి వివేకానికే వదిలేయాలి.ఇలా గ్రామంచాయితీ సిబ్బంది వారి అలసత్వం మూలాన పచ్చని ప్రకృతి సోయగాలతో, ప్రశాంత వాతావరణం తో అలరారే గ్రామాలు వ్యాధులకు కేర్‌ అఫ్‌ అ‌డ్రస్‌ ‌గా మారుతుండటం అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఇప్పటికైనా గ్రామ పంచాయితీ సిబ్బంది,నగర,మునిసిపల్‌,‌కార్పొరేష న్‌ ‌సిబ్బంది  ఈ డ్రైనేజ్‌ ‌కాలువల శుభ్రత, ఖాలీ  స్థలాలలో తిష్ట వేసుకొని కూర్చున్న ముళ్ల పొదల విషయం లో తక్షణమే స్పదించి యుద్ధ ప్రాతిపదికన తాము చేయాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేసినవారవుతారు. ఏమైనా మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఈ విషయాన్నీ అయా జిల్లాల కలెక్టర్ల,కమిషనరులు,మేయర్ల,  దృష్టికి తీసుకోని వెళ్లి వారు  ఈ డ్రైనేజ్‌ ‌కాలువల శుభ్రత, ఖాలీ  స్థలాలలో పేరుకొనిపోయిన ముళ్ల పొదలు తొలగించడం వంటి విషయాలలో  వారితో మాట్లాడి వీలయినంత త్వరగా వారు స్పందించేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

అలా చేసినప్పుడే అయా గ్రామాల,నగరాలు,పట్టణాల ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా మంచి ఆయురారోగ్యాలతో  పది కాలాల పాటు జీవించగలుగుతారు. తత్పలితంగా మన పట్టణాలు, గ్రామాలు,నగరాలు  ప్రగతికి, అభివృద్ధికి పర్యాయపదంగా నిలుస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా పురోగమిస్తాయి.అధికారులు నిత్యం గ్రామాలు,పట్టణాలలో పారి శుద్ధ కార్మికులు  చెత్త సక్రమంగా తొలగిస్తూ వున్నారా,లేదా అనే విషయం మీద వారానికి ఒక సారి సమీక్ష నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్రం లోని ప్రతీ గ్రామం,పట్టణం పరిశుభ్రంగా  వుండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానలు విధించాలి.పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి లో మాత్రమే వీధులు,రోడ్లు ,నాళాలు శుభ్రం చేస్తూ వున్నారు.అలా కాకుండా ప్రతీ రోజు గ్రామ,పట్టణం,నగరాలలో వీధులు శుభ్రం చేయడం తో పాటు నాలాలు,మురికి కాలువలో చెత్త ను తొలగించాలి. సీజనల్‌ ‌వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని మనవి.
– కామిడి సతీష్‌ ‌రెడ్డి జడలపేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా
.’’9848445134

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page