వికలాంగుల సంక్షేమం – సవాళ్లు

తెలంగాణ  రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు  రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ కొన్ని తరాలపాటు వికలాంగుల నిరాధారణకు గురై సామాజికంగా ఆర్థికంగా చితికిపోయిన వికలాంగులకు ఇది ఎంత మాత్రం సరిపడదు ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల వివక్షకు బలైన వికలాంగులు స్వరాష్ట్రంలో వికలాంగుల సాధికారతపై ప్రత్యేక ప్రణాళికబద్ద కృషి లేకపోయినా కేసీఆర్‌ ‌మార్కు పాలన పథకాలు కొంత వికలాంగులకు సైతం మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆసరా పథకం వికలాంగుల ఆత్మ స్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని వృద్ధి చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 80 శాతం మంది వికలాంగులు గ్రామీణ ప్రాంతాల లో ఎక్కడికి కానీ డొక్క ఆడనే నిస్సహాయ బ్రతుకులు ఈ రోజు ఒక్కపూట అయిన సంతోషంగా భోజనం తింటున్నారు.

దేశానికే ఆదర్శంగా వికలాంగుల పెన్షన్‌ :
‌కేంద్రం వికలాంగుల పింఛన్‌ ‌వాటాలో వివక్ష పాటించి కేవలం 300 రూపాయలు మాత్రమే ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కో వికలాంగుడికి 316 రూపాయల పింఛన్‌ ‌ప్రతినెల అందిస్తుంది తెలంగాణలో 33 జిల్లాలలో నాలుగు లక్షల 90 వేల మంది వికలాంగులకు లబ్ధి చేకూరుతుంది వికలాంగుల పింఛన్‌ ‌కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 150 కోట్ల రూపాయలను సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలను ధనాన్ని వెచ్చిస్తుంది అయితే ఇంకా అర్హత కలిగిన వికలాంగులకు పెన్షన్లు అందకపోవడం ఆలస్యంగా పెన్షన్లు అందించడం లాంటివి కేవలం పెన్షన్‌ ‌పై ఆధారపడి బ్రతుకులు ఈడుస్తున్న వికలాంగులకు అసౌకర్యంగా మారుతుంది. పెన్షన్‌ ‌ప్రతినెల మొదటి వారంలో అందిస్తే వికలాంగులకు మరింత మేలు జరిగే అవకాశం కలుగుతుంది.
పూర్తి ఉచితంగా వికలాంగులకు అత్యాధునిక సహాయ ఉపకరణాలు :
రాష్ట్రంలోని 17 వేల మంది వికలాంగులకు 24 కోట్ల రూపాయలతో అత్యాధునిక సహాయం పరికరాల  పంపిణీ చేసింది   రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో వికలాంగుల జీవితాలకు సరికొత్త బాటలు పడ్డాయి. బయటి సమాజంలో మింగిలి కావడానికి దోహద పడింది. ముఖ్యంగా శారీరక వికలాంగులకు 500 మంది వికలాంగులకు మూడు చక్రాల మోటార్‌ ‌వాహనాలు  మంచానికే పరిమితమైన కండరక్షణత వికలాంగులకు అత్యాధునిక బ్యాటరీ వీల్‌ ‌చైర్లు, బధిర వికలాంగులకు 1000 4జి మొబైల్‌ ‌ఫోన్లు, అందులకు 200 లాప్టాప్‌ ‌లు తోపాటు వివిధ రకాల వికలాంగులకు కావలసిన సహాయ పరికరాలను పంపిణీ చేశారు.అంతేకాకుండా నాలుగు లక్షల రూపాయల విలువగల జపాన్‌ ‌టెక్నాలజీకి సంబంధించిన ఆర్టిఫిషియల్‌ ‌లింబ్స్ ‌ను సీఎం సహాయ నిధి కింద మంజూరు చేయడం జరుగుతుంది. వికలాంగులకు చేయూతను అందించేందుకు కేటీఆర్‌ ‌తన పుట్టినరోజున ప్రత్యేకంగా గిఫ్ట్ ‌కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీనిలో అనేకమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీల ను భాగస్వామ్యం చేసి దాదాపు 2000 మంది వికలాంగులకు మోటార్‌ ‌చక్ర వాహనాలను అందించడం జరిగింది.
ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లలో 5శాతం రిజర్వషన్లను అమలు చేయాలని ప్రభుత్వము సరక్యులర్‌ 1950 ‌తీసుకొచ్చి  వికలాంగులకు చేయూతనిస్తుంది దళితులు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బందు పథకం అమలులో కూడా 5 శాతం రిజర్వేషన్లు అమలు లో భాగంగా మొదటి విడతగా 38,640 మంది దళితులకు దళిత బందు ఇవ్వగా అందులో 327 మంది దళిత వికలాంగులకు చేయూత నివ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం కావడానికి ఎంతో ఉపయోగ పడింది. వికలాంగుల హక్కల చట్టం 2016 లో వికలాంగులకు ఉద్యోగాలలో 4 శాతం , విద్య, ఉపాధి మరియు సంక్షేమ పథకాలలో 5 శాతం రిజర్వషన్లను అమలు చేయటం తో పాటు కెసిఆర్‌ ‌గారు మనస్సు పెడితే మరిన్ని అవకాశాలు వికలంగుల దరి చేరుతాయి  అనేది ప్రతి వికలాంగులు, సంఘాలు ఆ దిశ గా కృషి చేయాలని కోరుకుంటూ…..
ప్రపంచ వికలాంగుల దినోత్సవం శుభాకాంక్షలతో…
image.png
దైనంపల్లి మల్లికార్జున్‌
‌రాష్ట్ర అధ్యక్షులు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఇండియా , 9490300985.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page