విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌
పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. శనివారం దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన తొమ్మిదవ నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. సమావేశంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశగా పయనిస్తున్నామన్నారు.వందేళ్లలో ఒక సారి వొచ్చే కొరోనా మహమ్మారిని కూడా ఓడిరచామని తెలిపారు. అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి వికసిత భారత్‌ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ దశాబ్దం సాంకేతిక, భౌగోళిక-రాజకీయ మార్పులతో పాటు అవకాశాలతో కూడుకున్నదని, భారత్‌ తన విధానాలను అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎక్స్‌ వేదికగా ప్రధాని అన్నారు.

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఇది పురోగమనానికి సోపానమని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో విజన్‌ డాక్యుమెంట్‌కు సంబంధించిన అప్రోచ్‌ పేపర్‌పై ప్రధాని మోదీ చర్చకు మోదీ ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్‌ అధికారులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు మాట్టాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా సమావేశం నుండి వాకౌట్‌ చేసినట్లు మీడియాతో మాట్లాడుతూ వెల్లడిరచారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎక్కువసేపు మాట్లాడటానికి అనుమతించగా తాను మాట్లాడుతుండగా ఐదు నిమిషాల్లో తన మైక్‌ కట్‌ చేశారని మమత అన్నారు. కాగా కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు అన్యాయానికి నిరసిస్తూ తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ సహా పలువురు ఇండియా కూటమి ముఖ్యమంత్రులు సమావేశానికి ముందే వెల్లడిరచారు. బీహార్‌ సీఎం, ఎన్డీయే భాగస్వామి నితీష్‌ కుమార్‌ కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోయినా బీహార్‌ నుంచి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ సిన్హా ప్రాతినిధ్యం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page