విద్యానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంఏ పాషా మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 :  ఆమనగల్లు విద్యానగర్ కాలనీ కి సంబంధించిన దీర్ఘకాలిక, అత్యంత కీలకమైన సమస్యను పరిష్కారం చేసినందుకుగాను కమిటీ సభ్యులు కాలనీవాసులు అధ్యక్షుడు ఎంఏ పాషాని మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కాలనీ కార్యవర్గం సమావేశమై ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా పాష  ఉపాధ్యక్షుడు వర్కాల శేఖర్, జనరల్ సెక్రెటరీ మానుపాడు జంగయ్య, కోశాధికారి జిల్లెల్ల సుదర్శన్ రెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది.. విద్యానగర్ కాలనీ కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. కాలనీ అధ్యక్షులు పాషా మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన సమస్యను మీ అందరి సహాయ సహకారాలతో సాధించుకొని ముందుకెళ్తున్నామని ఇంకా ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి మీ సహాయ సహకారాలు ఇదేవిధంగా అందిస్తారని ఆశిస్తూ నేను కూడా మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి మన విద్యానగర్ కాలనీ నీ  మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక ఆదర్శ కాలనీగా తయారు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ సెక్రటరీలు మ్యాక వెంకటేశ్వర రెడ్డి, వి.సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు ప్రధానోపాధ్యాయులు పత్యా సార్, పాండు, కమిటీ సభ్యులు ఆర్టీసీ పర్వతాలు, ఆరిఫ్, రాములు, ఆనంద్ యాదగిరి, బాబు, పోలేపల్లి సత్యం, విఠాయిపల్లి విష్ణు, మధు అయ్యగారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page