విద్యా హక్కు పరిరక్షణ అందరి బాధ్యత

విద్యను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యాయుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యాయులను అధికంగా  తయారు చేయలేక పోతుందనేది సత్యం. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. గురువుల బోధనతోనే విద్యార్థులు ప్రపంచాన్ని తెలుసు కుంటారు, ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రపంచంలో సుమారు 80కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా అందులో 23.8 కోట్ల మంది మనదేశం లోనే ఉన్నట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రసిద్ధ గురువులు ఉన్నారు. న్యూటన్‌, ‌పైథాగరస్‌, ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌మొదలైన వారు ఆదర్శంగా నిలిచారు. విశ్వా మిత్రుడు, సాందీపుడు, పరశు రాముడు, ఆది శంకరాచార్యులు, ద్రోణా చార్యులు, పరమహంస మొదలైన వారంతా పేరొందిన గురువులు. విద్య అనే ఆస్తిని సమానంగా పంచగల శక్తి ఒక ఉపాధ్యాయుడికే ఉంది.

 

ప్రజాదరణ, అపారమైన గౌరవం ఉన్న కారణంగానే ఎంతోమంది ఉపాధ్యాయులు నాయకులయ్యారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఒక అధ్యాపకుడు భారత దేశానికి రాష్టప్రతిగా పనిచేసిన ఘనత ఆయనకే చెల్లింది. ఆయన పుట్టిన రోజును మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపు కుంటాము. ప్రఖ్యాత శాస్తవ్రేత్త అబ్దుల్‌ ‌కలాం రాష్టపతిగా పదవీకాలం ముగియ గానే చెన్నైలోని అన్నా విశ్వ విద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. బోధన చేస్తూనే ఆయన తుదిశ్వాస విడిచారు. యావత్‌ ‌ప్రపంచానికి ఆయన గొప్ప సందేశాన్ని అందించారు. జ్ఞాన సముపార్జన గురువు బోధన వలనే సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ‘గు’శబ్దంధకారే స్సాత్‌/ ‘‌రు’శబ్దంతి నిరోధతః, అంధకార నిరోధితం/ గురురీత్య బిదీయతే… అనే ఆర్యుల మాటలను పరికించి చూస్తే ‘అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే కాంతులను వెలిగించే వారినే నిజమైన గురువు లుగా భావించవచ్చు. నీతివంతమైన జీవ నానికి అలవా టుపడే విద్యా ర్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్ద గలగాలి.

 

సమాజాలు మారొచ్చు, సిద్ధాంతాలు మారొచ్చు. కానీ విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య సంబంధం శాశ్వతమైనది. ఈ విషయాన్ని యువ ఉపాధ్యాయులు గుర్తుంచు కోవాలి. విద్యార్థుల భవిష్యత్‌పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సమాచారం అందివ్వడంతోనే ఉపాధ్యాయుడి పాత్ర ముగియదని నిజానికి ఉపాధ్యాయుడు రకరకాల నైపుణ్యాల్ని విద్యార్థులకు అందించ వలసి ఉంటుందని కొఠారి కమిషన్‌ ‌పేర్కొంది. జాతి నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత కీలకపాత్ర పోషించేది గురువే అవుతాడు. అనేక మంది గురువులు విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచు కున్నారు. ఇందుకు ఉదాహరణ లుగా శ్రీరాముడు- విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుడు- సాందీపుడు, శివాజీ- సమర్ధ రామదాసు, వివేకానంద- రామకృష్ణ పరమ హంసలను పేర్కొనవచ్చు.

మాతృదేవోభవ- పితృదేవోభవ- ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టేవారు తమ వృత్తిని ప్రేమించే లక్షణం కలిగి ఉండాలి. తాము భావి పౌరులను తీర్చిదిద్దు తున్నామనే భావన ఉండాలి. విద్యార్థి ఎగిరే గాలిపటం అయితే దానికి ఆధారమైన దారం గురువు. ఉపాధ్యాయులు తమ మేధో సంపత్తిని పెంపొందించు కోవాలి. తమ జీవిత కాలంలో కనీసం నాలుగు తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వృత్తి నైపుణ్యాల పెంపు, కంప్యూటర్‌ ‌వినియోగం, డిజిటల్‌ ‌లిటరసీ కార్యక్రమాలను నిర్వహించాలి. బాలబాలికల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషిచేయాలి. డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‘‌మార్చలేని గతాన్ని గురించి ఆలోచించవద్దు.. చేతిలోఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు’ అనేవారు.

ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతుల్ని పునః సమీక్షించుకొని తదనుగుణంగా విద్యార్థులను నవ సమాజానికి అందించాలి. ఒకప్పుడు గుమాస్తాలను తయారుచేసే విధంగా విద్యాలక్ష్యం వుండేది. నేడు సామాజిక ప్రాధాన్యతలు మారి పోయాయి. దేశానికి పరిశోధకులు కావాలి. వ్యక్తుల స్వభావాన్ని, సామర్థ్యాన్ని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ప్రవచించిన అబ్దుల్‌ ‌కలాం పలుకులకు సార్థకత చేకూర్చాలి. నేటి యువ ఉపాధ్యాయులు అందుకు కంకణ బద్ధులై వృత్తిని నిబద్ధతతో నిర్వర్తించాలి. కోవిడ్‌ 19 ‌మహమ్మారి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విద్యావ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఊతమిస్తున్నది. ఇప్పుడు గతంలో కంటే, విద్యా హక్కును పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులతో కలిసి పనిచేయాలి. ఉపాధ్యాయ లోకం వెనక బడుతున్న విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి,  అభ్యాస అంతరాలను తగ్గించేలా ఉపాధ్యాయుల కృషి పరంగా ఇది చాలా కీలక సమయం. విద్య యొక్క భవిష్యత్తును మరియు బోధనా వృత్తిని రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం.
– సంగన భట్ల రామ కిష్టయ్య…
    9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page