వేల కోట్లతో  అభివృద్ధి చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది ఎమ్మెల్యే దేవిరెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7: గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరగని రీతిలో  నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. మంగళవారం లింగోజిగూడా డివిజన్ బారస పార్టీ సీనియర్ నాయకులు మేకల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిమూర్తి కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు బారస పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన నవకాంత్ రెడ్డి, సంతోష్, అహ్మద్, సతీష్ లు మాట్లాడుతూ సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలు నచ్చి బారస పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. తదనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చిన్నపాటి వర్షానికి పక్కన ఉన్న తపోవన్ కాలనీ, చుట్టుపక్కల కాలనీలు వరదనీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగేదని, కానీ ప్రస్తుతం అలా లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎస్.ఎన్.డి.పీ. పనులు మమ్మురంగా చేయించి ఇప్పుడు అభివృద్ధి ఫలాలు పొందడం జరుగుతుందని తెలిపారు. ఎంత పెద్ద వర్షం వచ్చిన ఇప్పుడు వరదనీరు ఎక్కడ కూడా నిలువదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోయిని మహేందర్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త మధుసాగర్, నాయకులు భాగవంత్ రాజ్, రాకేశ్, తిలక్ రావు, ఇంద్రజీ టీంకు, ఆశిష్, బస్తీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page