- ప్రభుత్వ దవాఖానాల్లో తగిన సదుపాయాలు లే
- నేను రిటైర్ కాను ..!
- కొన్ని సందర్భాల్లో రాత్రి 2 గంటల వరకు పని చేస్తాను
- ప్రజలకు సేవ చేయడంలో తృప్తి ఉంది
- గవర్నర్‌గా మంచి అనుభవం
- నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా డా।। తమిళి సై సౌందరరాజన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలంగాణా రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూనే కొన్ని ప్రభుత్వ దవాఖానాల్లో సదుపాయాలూ సరిగా లేక పేదలు వైద్యానికి దూరమవుతున్నారని రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై అసంతృప్తి వ్యక్తం చేసారు. రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య దూరం లేదని గవర్నర్ డా।। తమిళి సై సౌందరరాజన్ వ్యాఖానించారు. బిల్లుల ఆమోదంలో కూడా ఎలాంటి రాజకీయాలు చేయలేదన్నారు. న్యాయపరంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదవ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో కాఫీ టేబుల్ బుక్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అప్పట్లో తన ఫోన్ ట్రాప్ చేసారని కామెంట్స్ చేసింది వాస్తవమన్నారు. కొద్దిగా మిస్ కమ్యూనికేషన్ వల్ల అలాంటి వ్యాఖ్యలు జరుగుతాయని…తాను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని గవర్నర్ తమిళిసై చెప్పుకొచ్చారు. గవర్నర్‌గా తాను రాజకీయాలు చేయలేదని ప్రజలకు సేవ చేసేందుకే ప్రయత్నించానని తమిళిసై తెలిపారు.
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తనపై..ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోనని..సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కానని గవర్నర్ తెలిపారు. బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నానని సంతృప్తి వ్య్కతం చేశారు. అలాగే కోర్టు కేసులకు, విమర్శలకు భయపడబోనన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనతో తనను కట్టడి చేయలేరని, తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వొచ్చా…ప్రజల విజయమే విజయమని తమిళిసై వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం..కొట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నేను చూస్తున్నా. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను… తన దారి తనదేనన్నారు.
ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది కానీ గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉందని తమిళిశై గుర్తు చేశారు. నిధుల కొరత కూడా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప..పొలిటికల్ ఎజెండా లేదన్నారు. తనది మోసం చేసే తత్వం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు. నా మైండ్‌లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుందన్నారు. తాను నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తినన్నారు. పుదుచ్చేరికి కూడా గవర్నర్‌గా ఉన్నా..తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నా. అడ్మిస్టేషన్ పరంగా రెండు రాష్ట్రాలకూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా.
ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్ అధికారులు రారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నాను. నాకు గౌరవం ఇస్తారా.. నా పనిని గుర్తిస్తారా? అనేది నాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది. నేను ఆర్టీసీ కార్మికుల లబ్దికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఉందనిపిస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు’ అని గవర్నర్ తమిళి సై అన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగింది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చిందన్నారు.