ప్రపంచమంతా కొరోనాతో విల విలలా డుతు ంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచం లోకి వెళ్లి కొ•రోనాకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు సైతం లెక్కచే యకుండా తన విధి నిర్వ హిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాత్రం హడావుడిగా 142 జి.ఓ. తీసుకొచ్చి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది.వైద్య ఆరోగ్యశాఖలో అత్యున్నత ఫలితాలు రావాలంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగులు శారీరకంగా మరియు మానసికంగా, పరిపుష్టంగా కలిగి ఉండాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయి.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పెను ప్రకంపలను సృష్టిస్తున్న హడావుడిగా తయారుచేసిన జి.ఓ. 142 వలన వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 4000 ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది.నాలుగు వేల ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోతే జి.ఓ.77 వలన 33 ఉద్యోగాలను కొత్తగా సృష్టించారు.అవి కూడా డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్ లాంటి మినిస్టీరియల్ ఉద్యోగాలు మాత్రమే కొత్తగా సృష్టించడం జరిగింది.ఇది ఎంతవరకు సబబు.
రోజురోజుకు జనాభా పెరుగుతుంది కాబట్టి జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలను ఇంకా కల్పించాల్సిందే తప్ప ఉన్న ఉద్యోగాలను తీసివేసి తక్కువ ఉద్యోగులతో పని ఎక్కువగా చేయించడం అనేది సరైనది కాదు.దాని వలన ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురై మానసికంగా వేదనకు గురి కావాల్సి వస్తుంది.వైద్య ఆరోగ్యశాఖ భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రసవాలలో మొట్టమొదటి స్థానాన్ని పొందింది. అంటే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పనితనమే అందుకు నిదర్శనం. గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖలో పరిపాలనా సౌలభ్యం నిమిత్తము, పరిపాలన వికీంద్రీకరణలో భాగంగా మొదట సెక్టార్ స్థాయిలో ఎస్పిహెచ్‌ఓ అనే ఆఫీసర్ ను సృష్టించి అక్కడ ఒక కార్యాలయాన్ని ఉంచి జిల్లా స్థాయిలో డివిజన్ ను బట్టి క్లస్టర్ తయారు చేయడం జరిగింది.ఈ క్లస్టర్ కార్యాలయాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చేసే పనులన్నీ ఇక్కడే పూర్తి చేయాలనే సదుద్దేశంతో నెలకొల్ప బడ్డాయి.
ఆ తర్వాత మళ్లీ మరింత సౌలభ్యం కొరకై డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయాలను ప్రారంభించి అవి కూడా డివిజన్ కు ఒక్క అధికారిని నియమించి ప్రత్యేక కార్యాలయము అందులో సిబ్బందిని అనగా ఒక సిహెచ్‌ఓ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్,ఒక హెచ్‌ఈఓ,హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్,ఒక సూపర్వైజర్, పర్యవేక్షకుడు, పర్యవేక్షకురాలు, సీనియర్ అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్,మరియు సబార్డినేట్ స్టాఫ్ ఉండేవారు. ఇప్పుడు ఈ 142 జి.ఓ. ప్రకారము రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయాలు అన్నింటిని తీసివేయడం జరిగింది.డిప్యూటీ డి ఇమిడి డిస్కో అధికారులందరినీ వివిధ కార్యక్రమాలకు ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా లేదా ప్రోగ్రాం ఆఫీసర్లుగా నియమిం చాలని 142 జి.ఓ. ప్రకారం తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో గల 26 పిపి యూనిట్ లను తొలగించడం జరిగింది.
పిపి యూనిట్ అనగా ప్రభుత్వ దవాఖానాలో లో ప్రసవం కాగానే జాతీయ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించే సిబ్బందిని పిపి యూనిట్ అంటారు.
ఒక్కో పిపి యూనిట్ లో 10 మంది సిబ్బంది ఉంటుంది. అనగా బిడ్డ పుట్టగానే బీసీజీ,టీకా మరియు పోలియో చుక్కలు వేయవలసిన అవసరం ఉంది.ఈ అత్యంత ముఖ్యమైనటువంటి పని నిర్వహించే పిపి యూనిట్లను ఎత్తివేయడంతో శిశువులకు ప్రాణాంతకం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 120 ఎంపీహెచ్‌ఏ.ఎఫ్ సిబ్బంది మరియు 30 ఎంపీహెచ్‌ఎస్.ఎఫ్ పోస్ట్ లు శాశ్వతంగా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది.ఇవే కాకుండా రాష్ట్రంలో ఉన్న మలేరియా సబ్ యూనిట్ ఆఫీసులన్నింటినీ తీసివేయడం జరిగింది. మరియు జిల్లా ట్రైనింగ్ కార్యాల యము మరియు జిల్లాస్థాయిలో టీబీ కార్యాలయము, కుష్టు కార్యాలయంలో పనిచేస్తున్న పోస్టులు కూడా శాశ్వతంగా తొలగించడం జరిగింది. ఇలా123 కార్యాలయాలు రద్దు కావడంతో అందులో 1732 ఉద్యోగాలు శాశ్వతంగా పని కోల్పోవలసి వస్తుంది.అందులో ఆఫీస్ సుబార్డినెట్ 702, ఎంఎన్‌ఓలు 227,ఎఫ్‌ఎన్‌ఓ 56,ఎంపిఎచ్‌ఏ.ఎం 447, ఏపిఎంఓ లు 298, డిపిఎంఓ లు 69,డ్రైవర్ లు 198 మరియు నాలుగవ తరగతి ఉద్యోగులైన స్వీపర్,అటెండర్ కమిటీ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలన్నీ కోల్పోవలసి వస్తుంది.
మరియు 12 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 9 పోస్టులు మాత్రమే ఉంచడం జరిగింది. అనగా అందులో ఒక వైద్యాధికారి, ఒక స్టాఫ్ నర్స్,ఒక ఫార్మసిస్ట్, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆరోగ్య విస్తరణ అధికారి లేదా ఆరోగ్య బోధకులు మరియు పురుష పర్యవేక్షకుడు, మరియు స్త్రీ పర్యవేక్షకు రాలు, ఒక పురుష ఆరోగ్య కార్యకర్త, ఒక స్త్రీఆరోగ్య కార్యకర్త మాత్రమే ఉంటారు. ఇక్కడ ఆఫీస్ సభార్డునెట్ ఉద్యోగమే లేదు. 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 పోస్టులను ఇవ్వడం జరిగింది.అందులో ఇద్దరు వైద్యా ధికారులు, ఫార్మసిస్ట్ ,స్టాఫ్ నర్స్,ల్యాబ్ టెక్నీషియన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా పబ్లిక్ హెల్త్ నర్స్ మరియు ఆరోగ్య విస్తరణ అధికారి లేదా ఆరోగ్య బోధకులు మరియు పురుష పరిచయవేక్షకులు మరియు స్త్రీ పర్యవేక్షకులు పురుష ఆరోగ్య కార్యకర్త ,స్త్రీ ఆరోగ్య కార్యకర్త,డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు.ఈ 24 గంటలు పనిచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక నైట్ వాచ్మెన్ గాని ఒక అటెండర్ కానీ లేకపోవడం శోచనీయం.. ఎందుకంటే 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్థానికంగా జరిగే సాధారణ ప్రసవాలు మహిళలు,సిబ్బంది ఉంటారు.
కాబట్టి వారికి భద్రతగా నైట్ వాచ్మెన్ ఉద్యోగం కచ్చితంగా అవసరం.ఇలాంటి నైట్ వాచ్మెన్ ఉద్యోగం లేకుండా విధులు నిర్వహించడం చాలా కష్టం అవుతుంది.సాధారణంగా గ్రామీణ స్థాయిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ ఊరికి బయట నిర్మించడం జరిగింది. వారికి భద్రత చాలా అవసరం కావున లోపభూయిష్టమైనఈ 142 జి.ఓ. రద్దు చేయాలని ఉద్యోగులందరూ రాష్ట్రవ్యాప్తంగా గత 15 రోజులుగా పోరాడుతున్నారు. అయిన ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుంది.జిల్లా స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీ అనగా ఇందులో ప్రభుత్వ వైద్యులు మరియు స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు,ఆరోగ్య విస్తరణ అధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు,స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్త లు స్త్రీ మరియు పురుషులు, సభార్డినేట్ సిబ్బంది, డ్రైవర్లు అందరూ ఈ పోరాట కమిటీలో పాల్గొంటున్నారు. ఇదే విధంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తే అక్టోబర్ 5 తర్వాత నిరవధిక ధర్నా నిర్వహిస్తామని జి.ఓ. 142 రద్దు పోరాట కమిటీ హెచ్చరిస్తుంది.జిల్లాస్థాయి, క్షేత్రస్థాయి అధికా రులను సంప్రదించకుండానే నాలుగు గోడల మధ్య ఈ జి.ఓ. 142 తయారుచేసి బలవంతంగా ఉద్యోగులపై రుద్దడం సరైనది కాదు.ఈ ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకొని అందరి సలహాల మేరకు అత్యు త్తమైన నూతన జి.ఓ విడుదల చేసి పేద ప్రజలకు అందరికీ మరియు ఉద్యోగులకు అనుగుణంగా ఉండే విధంగా చేయాలని 142 జి.ఓ పోరాట కమిటీ కోరుతుంది.
యెనుగందుల శంకర్
జిల్లా కో కన్వీనర్, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ యాక్షన్ కమిటీ, నిజామాబాద్.