ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : ప్రజల నుండి డబ్బులు రాబట్టుకోవడానికి 3 నెలల ముందే టెండర్స్ పిలిచి రిజర్వేషన్ ప్రకారం వైన్ షాప్ లు అని చేప్పిన ప్రభుత్వ్యం గౌడ్ లకు 15 శాతం, 10 శాతం SC లకు, 5 శాతం ST లకు మొత్తం ముప్పై శాతం రిజర్వేషన్ లో షాపులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వ్యం దరఖాస్తు రుసుము చెల్లించడం లో ఎందుకు రాయితీ ఇవ్వలేదని టీపీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జనరల్ షాప్ లకు కట్టే రూ. 2 లక్షలు ఎందుకు కట్టించుకుంటున్నారు. షాప్ రాకపోతే రిజర్వేషన్ దారులకు జేబులు గుల్లేనా..? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిజంగానే వైన్స్ లైసెన్స్ లను 30 శాతం షాప్ లు రిజర్వేషన్ లో ఇవ్వాలి.. ఇప్పటి వరకు దరఖాస్తు రుసుము కట్టిన వారికి ఇక ముందు కట్టే వారికి టెండర్ రాని యెడల వారి డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వ్యం ఎస్సీ ఎస్టీ గౌడ్లకు సామజిక వర్గాలకు న్యాయం చేసి తమ చిత్తశుద్దిని నిలుపుకోవాలన్నారు. పక్కరాష్ట్రాల వారు సిండికేట్ గా ఏర్పడి షాపులు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అని వారిని నిరోధించి టెండర్లలో పూర్తిగా స్థానికులకే అవకాశం కల్పించాలని తెలంగాణ లో ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.