2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా
వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం
80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌తో లబ్ది
పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు
జన్ ధన్ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ
ఏటా 11.8 కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన
యధాతథంగా పన్నుల చెల్లింపు విధానం
లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : వొచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని ఆమె తెలిపారు. భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన ‘డెమొక్రసీ, డెమొగ్రఫీ, డైవర్సిటీ’ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో తాత్కాలిక బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని, తాము దాన్ని అమలు చేసి చూపుతున్నామని, సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నామని అన్నారు. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని ఆమె తెలిపారు. ‘గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వొచ్చాయి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయి. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారు. పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నాం. దాదాపు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ది పొందారు. రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నాం. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని వివరించారు. పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం. మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్ ధన్ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు ఆదా అయ్యింది. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశా..అని నిర్మల అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. పీఎం ఫసల్ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతుంది.
జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చాం. 3000 ఐటీఐలు, ఏడు ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 15 ఎయిమ్స్‌లు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశాం. గత పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితపర్చడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకం. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడిరది. మూలధన పెట్టుబడులకు ‘గిప్ట్’ ఒక ప్రధాన మార్గంగా అవతరించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చింది. సామరస్యంతో కూడిన ప్రకృతి, ఆధునిక మౌలిక సదుపాయాలే వికసిత్ భారత్ విజన్. ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుంది. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం’ అని సీతారామన్ తన బ్జడెట్ ప్రసంగంలో వెల్లడిరచారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వొచ్చాయి. 2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. అన్ని వర్గాలు, ప్రజలందరి సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.’ అని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా బ్జడెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కుంది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి..అని నిర్మల పేర్కొన్నారు. కొరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించిందని చెప్పారు. పాలనలో పారదర్శకత తీసుకువొచ్చామన్నారు.
చిన్న బ్జడెట్‌పై భారీగా అంచనాలు ఉన్నాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే బడ్జెట్ లక్ష్యం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారని అన్నారు. పదేళ్లలో ఇళ్ల నిర్మాణానికి ఎంతో కృషిచేశామని చెప్పారు నిర్మలా సీతారామన్. పదేళ్లలో దేశ ఆర్థికస్థితి ఉన్నతస్థాయికి చేరుకుందన్నారు. పేదల అభివృద్ధే దేశ అభివృద్ధి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం సవ్మిూళిత వృద్ధి ఆలోచనా విధానం గ్రామ స్థాయికి చేరి సక్సెస్ అయ్యిందన్నారు. గ్రావిూణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతుందని చెప్పారు. గతంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదదంగా ఉండేదని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది పనితీరుగా మారిందన్నారు. పేద మహిళ, యువత, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పేదరికం నుంచి పదేళ్లలో 25 కోట్ల మందికి విముక్తి కల్పించామన్నారు. జన్‌ధన్ అకౌంట్ల ద్వారా రూ. 34 లక్షల కోట్లు అందించామన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం 11.8 కోట్ల మందికి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడిరచారు. 2014లో దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎంతో మార్పు వొచ్చిందన్నారు.
సంస్కరణల పథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజన్ గురించి వివరిస్తూ…గత 10 సంవత్సరాలుగా పరివర్తన కాలం వొచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పురోగమిస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వొచ్చాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి, ఉపాధి పొందేందుకు వీలుగా ప్రజల ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు చూస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ సర్కార్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నాం. ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.