ఇందుకోసం 30వేల కోట్లు వదులుకున్నాం
విద్యుత్ స్థాపక శక్తిని పెంచిన ఘనత మాదే
నిజంగానే కెసిఆర్ సత్యహరిశ్చంద్రుడే
అసెంబ్లీలో మాజీ మత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : రైతుల పొలాల్లో విూటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకోలేదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీటర్లు పెట్టని ఫలితంగా కేంద్రం ఇచ్చే రూ.30 వేల కోట్లను కూడా వదులుకున్నట్లు తెలిపారు. విద్యుత్ విూటర్లపై సీఎం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. మోదీ, కేసీఆర్, ఉదయ్ స్కీమ్ గురించే మాట్లాడుకున్నారని చెప్పారు. 2014కి ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరిగిందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరగలేదని, పదేళ్ల తమ పాలనలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందని, 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 1,196 కిలో వాట్లు ఉండేదని, 2024లో అది 2,349 కిలో వాట్లకు చేరిందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ వినియోగం పెరిగింతని, రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరాను బలోపేతం చేశామని, వినియోగం ఆధారంగానే విభజన సమయంలో రాష్ట్రానికి విద్యుత్‌ను కేటాయించారన్నారు. రూ.24 వేల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం తమ చేతికి వొచ్చిందని జగదీష్ రెడ్డి తెలిపారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలని ప్రశ్నిస్తూ.. అప్పులు చేయకుండా నోట్లు ముద్రించాలా అంటూ ఎదురు ప్రశ్నించారు. అప్పులు చేస్తున్నామని అసెంబ్లీలో కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఏదో కొత్త విషయం చెప్పినట్లు ఇప్పుడు పదేపదే అప్పులు చేశారు అంటున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మాటికీ సత్యహరిశ్చంద్రుడే అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రేవంత్‌లా సంచులు మోసే చంద్రుడు కాదంటూ ఎద్దేవా చేశారు. శాసనసభలో రేవంత్ మాట్లాడుతూ..
సత్యహరిశ్చంద్రులు అయితే ఎందుకు విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్‌కు అడ్డు వొస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగతనం దొరికిపోయింది కాబట్టే రేవంత్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. తాను విద్యుత్ విషయంలో నిజనిజాలు మాట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినే వడివడిగా సభలోకి వొచ్చి తనకు అడ్డు తగిలారని, సీఎం సభలో అడుగు పెట్టగానే చర్చ తప్పుదోవ పట్టిందన్నారు. కేసీఆర్ కాలు గోటికి విూరు సరిపోతారా..అంటూ విరుచుకు పడ్డారు. కేసీఆర్ గురించి మాట్లాడిరది రికార్డుల నుంచి తొలగించాలని, సభను హుందాగా నడిపించాలని జగదీష్ రెడ్డి కోరారు. సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వారు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లంటూ జగదీశ్ రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు.