-పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలి
-సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ టికెట్ పై పునరాలోచించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్,తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ కి వినతి పత్రం అందజేశారు.తెలంగాణ లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఒక సీటు ఇవ్వకుండా దూరంపెట్టిన కేసీఆర్ పునరాలోచించాలని ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కి వినతి పత్రం అందించిన ఉమ్మడి మెదక్ జిల్లా ముదిరాజులు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజవర్గాల్లో ఆరు లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ఒక సీటు ఇవ్వకుండా మోసం చేయడం చాలా బాధాకరం, అత్యధిక బీసీ, ముదిరాజ్ జనాభా కలిగిన పటాన్ చెరు నియోజవర్గ ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కి కేటాయించి బిసిలకు,ముదిరాజులకు గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు.లేని పక్షాన ముదిరాజులందరూ బిఆర్ఎస్ పార్టీకి దూరం కావడం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్,జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు నారబోయిన శ్రీనివాస్, నాయకులు నల్లవల్లి సురేష్, పోతారం రాములు,వావిలాల్ రమేష్,మంగంపెట్ గణేష్,ఉట్ల బోగురు బిక్షపతి,నల్లవాల్లి రాగుల నవీన్,తదితరులు పాల్గొన్నారు.