శిక్ష తప్పదు సుమీ!

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి
అప్పుడే పగుళ్ళుచూపి
ప్రశ్నార్థకంగా మిగిలింది

భారీ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు
మరింతగా కుంగిపోతూ
పతనావస్థలో చిక్కింది

బూరీ కాళేశ్వర ప్రశస్తి
నానాటికి దిగజరుతూ
నగుబాటు అవుతుంది

ఇంత జరుగుతున్నా
మన అభినవ ఇంజనీర్‌
‌పెదవులు విప్పని వైనం

ట్విట్టర్‌ ‌పిట్టలదొర సైతం
చీమకుట్టిన దొంగ చందం

పైగా ప్రకృతి విపత్తులపై
నెపం నెట్టేసే కుయుక్తులు
తలాతోకలేని ప్రచారాలు

ఇవేవీ చాలదన్నట్లు
కాళేశ్వరం అన్ని వైపులా
కాఖీ బలగాల పహారాలు
అప్రకటిత నిషేధితాజ్ఞలు
మీడియాపై నియంత్రనలు
ఏకంగా 144 సెక్షన్‌ అమల్లు

ఓ పాసిజం పాలకుడా
మీ మౌనము మాటున
మతలబు జగద్విదితమే

మీ అవినీతి బండారం
బహిరంగపు రహస్యమే

ఇకనైనా దీర్ఘమౌనం విడిచి
తప్పులు ఒప్పుకుంటే సరి !
కాదంటే శిక్ష తప్పదు సుమీ!!
( కాళేశ్వరం మెడిగడ్డ బ్యారేజి కుంగుబాటు నేపథ్యంగా..)

– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page