జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ ఉత్సవము జాతరకు సంబందించిన ఆలయ ప్రసాదం, కొబ్బరికాయలు, ఒడి బియ్యం, ఆలయ షాప్ లకు వేలం పాట శుక్రవారం సిద్దిపేట జిల్లా దేవాదాయ,
ధర్మదాయ శాఖ,ఈవో మోహన్ రెడ్డి, సర్పంచ్ రజిత రమేష్, ఎంపీటీసీ కావ్య దర్గయ్య ఆధ్వర్యంలో బహిరంగ వేలం వేయడం జరిగింది.ఈ సందర్బంగా ఈవో సిద్దిపేట జిల్లా దేవాదాయ శాఖ వారు మాట్లాడుతూ శ్రీ కొండపోచ అమ్మవారు ఆలయానికి సంబందించిన బహిరంగ వేలం లడ్డు ప్రసాదం గాడి చర్ల పెద్ద నరేష్ 25,40,000 లక్షల వేల రూపాయలు కొబ్బరికాయలు గాడి చర్ల శ్రీ వాణి 12 లక్షల 14 వేల రూపాయలు అమ్మవారి ఒడిబియ్యం సిహెచ్ భాగ్యలక్ష్మి 8 లక్షల 90వేల రూపాయలు షాప్ లు 4 లక్షల 60 వేలు గత సంవత్సరం కంటే అమ్మవారి వేలం పాటలో మొత్తం లాభం 8 లక్షల 74 వేల రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి శివరాజ్, సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగా రావు, శ్యామ్ రాజ్, రికార్డ్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.