‌శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబమ్‌ ..!

  • ఆరు సంవత్సరాల తరువాత…
  • ప్రధానాలయంలో భక్తులకు మొదలైన నారసింహుని దర్శనాలు
  • యాదాద్రిలో వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ
  • అత్యంత వైభవోపేతంగా సాగిన శోభయాత్ర
  • స్వామివారి పల్లకి మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ‌గర్భాలయంలోకి చేర్చిన ఉత్సవ మూర్తులు
  • ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం
  • యాదాద్రి పునర్నిర్మాణ కర్తలకు సిఎం కెసిఆర్‌ ‌సన్మానం
  • ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం
  • రోజుకు 60 వేల మంది భక్తుల దర్శనం చేసేలా నిర్మాణం
  • 34 అడుగుల బంగారు గజ స్థంభం ఏర్పాటు

యాదాద్రి భువనగిరి, మార్చి 28(ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) : ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా రూపొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వయంభువుల దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం 11:55 గంటలకు సుదర్శన నారసింహ శ్రీచక్రానికి సంప్రోక్షణ చేసిన మీదట కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులతో కలిసి 12.15 గంటలకు తొలి దర్శనం చేసుకున్నారు. ఉద్ఘాటన క్రతువులో భాగంగా మహాకుంభ సంప్రోక్షణ పాంచారత్ర ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా వైభవోపేతంగా నిర్వహించారు. ఇందుకు స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన ఈ నెల 21న అంకురార్పణ చేశారు. బాలాలయంలో సప్తాహ్నిక దీక్షా పంచకుండాత్మక యాగం నిర్వహించారు. స్వామి వారి నిత్య కైంకర్యాల అనంతరం ఉద్ఘాటన సంబంధిత క్రతువులు ప్రారంభమయ్యాయి. అయితే హెలికాప్టర్లో నేరుగా యాదాద్రి చేరుకున్న సిఎం కేసిఆర్‌ ఆలయంపై విహంగ వీక్షణం చేశారు.

పంచకుండాత్మక యాగం పూర్ణాహుతి అనంతరం.. బాలాలయం నుంచి వేదమంత్రోశ్చరణల నడుమ స్వామివారి సువర్ణమూర్తుల శోభాయాత్ర  వైభోపేతంగా నిర్వహించారు. సాయంత్రం ఏడున్నర నుంచి.. కళ్యాణం, ఆచార్య, రుత్విక్‌ ‌సన్మానం, ఇదిలావుంటే.. దర్శనాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కొండ కింది నుంచి భక్తులను తీసుకొచ్చేందుకు మినీ బస్సులు ఏర్పాటు చేశారు. ఉద్ఘాటనకు యాదాద్రి ఆలయాన్ని.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇకపోతే ఉదయం 11.55 గంటలకు మిథున లఘ్న శుభ ముహూర్తంలో ఏక కాలంలో 92 స్థానాల్లో మహా కుంభాభిషేక పర్వం జరిగిపోయింది. దివ్య విమాన గోపురం సుదర్శన చక్రం వద్ద మహా కుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌, ‌శోభ దంపతులు, మనుమడు హిమాన్షు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచనం చేశారు. ఈఓ గీత దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.

Sri Lakshmi Narasimha Karavalambam
గర్భాలయంలోకి చేరిన ఉత్సవ మూర్తులు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులు గర్భాలయంలోకి చేర్చారు. స్యయంభువు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి మొదటి పూజ, మహానివేదన, మొదటి తీర్థ ప్రసాదగోష్ఠి వేద పండితులు సమర్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా వేద ఆశీర్వచనం పలికారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా స్వయంభువు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కేసిఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్య విమాన గోపురం పై బంగారు సుదర్శన చక్రం వద్ద కుటుంబ సమేతంగా మహా కుంభ సంప్రోక్షణ పూజల్లో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. పవిత్ర నదీ జలాలతో సప్త గోపురాలపై కలశాలకు మంత్రులు, వేదపండితులు జలాభిషేకం చేశారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న వైటీడీఏ వైస్‌ ‌ఛైర్మన్‌ ‌కిషన్‌ ‌రావు, ఈవో శ్రీమతి గీతారెడ్డి, ఆలయ ధర్మకర్త నర్సింహ మూర్తి, అర్కిటెక్ట్ ఆనంద సాయి, స్టపతి సుందర్‌ ‌రాజన్‌, ఆర్కిటెక్‌ ‌మధుసూదన్‌ ‌స్థపతి వేలు, ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు సన్మానించారు.

Sri Lakshmi Narasimha Karavalambam

యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి,  రాష్ట్ర మంత్రులు టి.హరీష్‌ ‌రావు, పి.సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ,  ఎ.ఇంద్రకరణ్‌ ‌రెడ్డి జి.జగదీశ్‌ ‌రెడ్డి, ఎస్‌. ‌నిరంజన్‌ ‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, వి.శ్రీనివాస్‌ ‌గౌడ్‌,  ‌వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సిహెచ్‌ ‌మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, ‌సత్యవతి రాథోడ్‌, ‌పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ‌పార్లమెంట్‌ ‌సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌,  ‌శాసనసభ్యులు,  ఎమ్మెల్సీలు,  జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లు, రాష్ట్ర ఉన్నతాధికారులు,  జిల్లా కలెక్టర్‌ ‌పమేలా సత్పతి, గీతారెడ్డి,  జిల్లా అధికారులు,  జిల్లా ప్రజా ప్రతినిధులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page