మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో సి ఎం కే సి ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లులేని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు .శనివారం మహేశ్వరం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి ఆకన్‌పల్లి, గట్టుపల్లి,కోళ్ల పడకల్, పెండ్యాల్ తో పాటు పలు గ్రామల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు.గ్రామిణ ప్రాంతాల అభివృద్దికి ఎంతో కృషి చేసి మౌలిక సదుపాయలు అన్నీ గ్రామాల్లో సి సి రోడ్డు నిర్మాణం అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తున్నామన్నారు .సి ఎం కే సీ ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 400 కే గ్యాస్ అందిస్తారని అన్నారు.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లు 5 వేలు,4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు.మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా 3 వేలు అందిస్తామని,రైతు భీమా లాగా 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.మహేశ్వరం నియోజకవర్గములో రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు 389 కోట్లు,రైతు భీమా ద్వారా 24 కోట్లు,రుణమాఫీ క్రింద 87 కోట్లు ,ఆసరా పెన్షన్లు 576 కోట్లు,కళ్యాణాలక్ష్మి కింద 108 కోట్లు,షాది ముబారక్ పథకంతో 51 కోట్లు,ముఖ్యమంత్రి సహాయనిది తో 15 కోట్ల సహాయం చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు రాజు నాయక్,బి ఆర్ ఎస్ నాయకులు శ్రీశైలం, సాజెత్, మల్లేష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, దోమ శ్రీనివాస్ రెడ్డి,హెచ్ చంద్రయ్య,ప్రభాకర్ రెడ్డి,సర్పంచ్ లు, ఎం పి టి సి లు, బి ఆర్ ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు .