‘‘‌సంపద సృష్టికర్తలు కార్మికులే’’ నేడు మేడే

ప్రపంచాన్ని నడిపించేది కార్మికుడే .. కార్మికుని చెమట చుక్కల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలు.కార్మికుడు లేని ప్రపం చాన్ని ఊహించలేము. శ్రమ లేనిదే జీవితం లేదు. కార్మిక కర్షక వీరుల త్యాగాల పునాదుల మీదనే మానవ జీవనయానం కొనసా గుతు ంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి తేనే వస్తు ఉత్పత్తి అయ్యేది..ఆ వస్తూ ఉత్పత్తిని ఉపయోగించి అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవిస్తున్నాము. సంపద సృష్టికర్తలు కార్మికులే. .’’శ్ర మైకజీవన సౌందర్యానికి సమానమైనది లేదని ‘‘ శ్రీ శ్రీ అన్నట్లు శ్రమకు మించిన ఆయుధం లేదు..శ్రమ శక్తి లేనిదే ఏ దేశ అభివృద్ధి జరగదు. అందుకే శ్రమను గౌరవించాలి, గుర్తించాలి మరియు శ్రమ సంస్కృతిని అలవర్చుకోవాలి. శ్రమజీవుల ను ఆదరించి ఆదు కోవాల్సిన అవసరం ఉంది. శ్రమజీవుల త్యాగఫలమే మే డే… ఎందరో కార్మికులు తమ రక్తాన్ని చిందించిన ఆ రోజులను చారిత్రాత్మక రోజులుగా గుర్తించారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. కార్మిక వర్గానికి కాకుండా ప్రపంచానికంతటికీ నవ కాంతులను అందించిన రోజు… మే డే సందర్భంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం విశేషాలను , నేపథ్యాన్ని ఒకసారి స్మరించుకుందాం……
పారి శ్రామిక విప్లవం రాక ముందు ప్రజలు గంటలకొద్దీ విసుగు విరామం లేకుండా బానిసలుగా పనిచేసే వారు. మనిషి తన విజ్ఞాన అభివృద్ధిని పెంపొందించుకుని సుఖమయ జీవనానికి యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రీకరణ తర్వాత పెట్టుబడి తో పాటు శ్రమకు కూడా తగిన ప్రధాన్యత ఏర్పడింది. పెట్టుబడి ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మాకు ,మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని, వెట్టిచాకిరి చేయలేమని 8గంటల పనిదినం కోసం పోరాడటం, చివరకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించడం శ్రామిక వర్గపోరాటానికి నిదర్శనం… 1884లో కార్మికులు రోజుకు 16 నుండి 18 గంటలు పని చేయాల్సి వచ్చేది. వారికి లభించే వేతనాలు అంతంతమాత్రంగానే ఉండేవి. దీంతో అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని ఉండాలని ఆందోళన కొనసాగించారు .

ఈ ఆందోళన 1886 నాటికి తీవ్రతరమైంది. మే 1, 1886 న 40 వేల మంది కార్మికులు సమ్మె మొదలుపెడితే, మే 3 నాటికి శ్రామికుల సంఖ్య లక్ష మందికి చేరుకుంది. సమ్మె ఉధృతం అయ్యేసరికి పారిశ్రామిక సంస్థల యజమానులు పోలీసు సాయం కోరగా, పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. దీనితో కార్మిక నాయకులు ఆగస్ట్ ‌స్పైస్‌, ‌పార్సన్‌…‌క్లో రిన్‌ ‌మోస్ట్ ‌లూయిస్లింగ్‌ అనే నాయకుల ఆధ్వర్యంలో మెక్కార్మిక్‌ ‌రిఫర్‌ ‌వర్కస్ ‌పారిశ్రామిక సంస్థ ముందు పెద్ద ప్రదర్శన జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శన మీద పోలీసులు హే మార్కెట్‌ ‌వద్ద మే 4,1886న జరిపిన కాల్పులలో 8 మంది కార్మికులు మరణించారు. 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో ఏడుగురు చనిపోవడం జరిగింది.ఈ కాల్పులకు కారణం కార్మిక నాయ కులేనని వారి మీద హత్యా నేరం మోపి నవంబర్‌ 11 ,1887 ‌న పార్సన్‌, ‌స్పైస్‌,ఏం‌గల్‌ ,‌ఫిషర్‌ ‌లకు ఉరిశిక్ష అమలు చేశాయి. దీనిని వ్యతిరేకించిన మరో కార్మిక నాయకుడు లూయిస్‌ ‌లింగ్‌ ‌తన నోటిలో బాంబు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతాన్ని హే మార్కెట్‌ ‌దారుణ హత్యాకాండ గా అభివర్ణిస్తారు. దీంతో అనేక దేశాల్లో ఈ హత్యాకాండను ఖండిస్తూ ప్రదర్శనలు 66దేశాలలో ఆందోళనలు జరిగాయి. చిట్టచివరకు కార్మికుల అమరత్వంతో ఎనిమిది గంటల పనినీ సాధించ కోవడం జరిగింది. ఆ విజయానికి చిహ్నం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ను మే 1న జరుపుకు ంటున్నారు.

మే డే కు కారణభూతమైన చికాగో కాల్పుల్లో మరణించిన కార్మిక అమరవీరులు చిందించిన రక్తపు రంగుకు సంకేతంగా ఎర్రజెండాను ఎగరవేసి అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.. భారతదేశంలో 1923,మే 1 లేబర్‌ ‌కిసాన్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మద్రాస్‌ ‌లో మే డే ఉత్సవాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 80దేశాలలో ఈ ఉత్సవాలు జరుపుకు ంటున్నారు.భారతదేశంలో శ్రామికులకు రోజుకు ఎనిమిది పనిగంటల పని విధానం ప్రవేశపెట్టి ,స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం,కనీసవేతనము, శ్రామికుల నష్టపరి హారచట్టం, ప్రసూతి లాభాల చట్టం, ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం, ఉద్యోగుల భవిష్యత్తును నిధి పథకం, శ్రామికుల ఆరోగ్య రక్షణ సంక్షేమం, పెన్షన్‌ ‌పథకం మరియు సాంఘిక భద్రతా చర్యలు కార్మికుల సంక్షేమానికి పనికి వచ్చే ఎన్నో చట్టాలను డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంలో పొందుపరచటం జరిగింది… కానీ నేడు ఈ చట్టాలన్నీ రద్దు చేయడానికి పాలక ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి .

ఆర్థిక మాంద్యం, కొరోనా విలయతాండవం ప్రజలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేసాయి. దీంతో ప్రజల కార్మికుల తలసరి ఆదాయం, కొనుగోలుశక్తి పడిపోయింది. దీనిని పెంపొందింఛాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా కార్మిక చట్టాలలో మార్పులు, పని గంటలు పెంపు, మౌలిక సౌకర్యాలు ఎత్తివేతకు పూనుకున్నాయి. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కార్మిక చట్టాలను మూడేండ్లు నిషేధం, ఎనిమిది గంటల పని విధానాన్ని12 గంటలకు తాత్కాలికంగామారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.కార్మికుల,ఉద్యోగులహక్కుల రద్దు తాత్కాలికమేనని చెబుతున్నప్పటికీ శాశ్వతంగా రద్దు చేసే కుట్ర దాగి ఉందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్స్ ‌గా రూపొందించడం జరిగింది. దీంతో వలస కార్మికుల అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారనుంది. గత 2సంవత్సరాలుగా కొరోనా వైరస్‌ ‌విజృంభణ లో అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ‌విధించడం వల్ల పరిశ్రమలు ఆగిపోయి, ఉత్పత్తి నిలిచిపోయింది. వ్యాపారాలు, కొనుగోలు అమ్మకం ప్రక్రియలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వారి ఆదాయం గణనీయంగా పడిపోయింది . కనీసం తినడానికి తిండి లేక, చేయడానికి పని లేక వలస కార్మికులు తామున్న పట్టణాలను విడిచి తమ సొంత గ్రామాలకు వందల కిలోమీటర్లు నడిచి వెళుతూ ప్రాణాలు కోల్పోయినపరిస్థితి నిజమే కదా! ఇలాంటి తరుణంలో బడా కార్పొరేటు దారుల ఆదాయాలు లాభాలు తీవ్రస్థాయిలో వందల రెట్లు రెట్టింపు అవ్వడం ఆశ్చర్యకరం. ఉదాహరణకు 2014లో అంబానీ సంపద ఒక లక్ష 35 వేల కోట్లుకాగా 2021లో ఆరులక్షల మూడువేల కోట్లు. అమెరికా సంపన్నుడు వారన్‌ ‌బఫెట్‌ ‌ను అధిగమించి ప్రపంచంలోని ఐదవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. ఆదాని మొత్తం నికర విలువ 122.3 బిలియన్‌ ‌డాలర్లు. అతను ఆసియాలోని నంబర్‌ ‌వన్‌ ‌స్థానం లో నిలిచాడు. ఆయన సంపద ఒక్కరోజులోనే 65091కోట్లకు పెరిగింది. దీనిని బట్టి కార్పొరేట్ల సంపద ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు..

కొరోనా రెండవ దశలో వైరస్‌ ఉధృతికి కట్టు దిట్టమైన చర్యలు తీసుకోకపోవడం మూలంగా సునామీలా విరుచుకుపడుతున్న పరిస్థితి, ప్రతిరోజు లక్షలాది మంది వైరస్‌ ‌బారిన పడుతుండగా, వైరస్‌ ‌బారిన పడిన వేలాదిమంది శవాలుగా మారుతున్న, కనీస సదుపాయాలు, మౌలిక వసతులు అయినా బెడ్లు ,ఆక్సిజన్‌ అం‌దని దుస్థితిలో ఉన్నను, తక్షణమే సహాయం అందించ వలసినటువంటి విపత్కర దయనీయమైన ఈ పరిస్థితిలో కూడా ప్రైవేటీకరణ చర్యలు శరవేగంగా జరుగుతాయని, అవి ఆగే సమస్య లేదని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం శోచనీయం మైన విషయం .. భారత రాజ్యాంగం ప్రకారం కార్మిక చట్టాలు ఉమ్మడి జాబితాలోని అంశం. కార్మిక చట్టాలలో మార్పులు చేర్పులు చేయవలెనన్న కార్మికులు,ప్రభుత్వం మరియు సంస్థల యాజ మాన్యాల చేత త్రైపాక్షిక చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక చట్టాలకు ఆర్డినెన్సును తీసుకువచ్చి పారిశ్రామికవివాదాల చట్టం, వృత్తి భద్రత, కాంట్రాక్టు కార్మికుల చట్టం, వలస కార్మికుల, సమాన వేతనం చట్టాలను రద్దు చేశాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచించిన విధానాలకు వ్యతిరేకం. ఈ విధానాల వల్ల కార్మికుల హక్కులను కొల్లగొట్టి, వారిమనుగడకు పెను ముప్పు తీసుకురావడమే..నిరుద్యోగిత రేటు 7.5% నుండి23.6 శాతంనకు పెరిగింది. చాలా మంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది.

కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు 1990 నూతన సరళీకృత ఆర్థిక విధానాల అమలు లో భాగంగానే ప్రారంభం అయినాయి. యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛ పూరిత హక్కులు అధికారాలు దాఖలు చేయబడ్డాయి…. ప్రస్తుత తరుణంలో కార్మిక కర్షకుల అంతా సంఘటితమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మిక కర్షకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉన్నది. ప్రపంచంలోని కార్మికులందరికీ కష్టం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి తమ హక్కులను సాధించుకోవడానికి ‘‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి ‘‘. అని కారల్‌ ‌మార్కస్ ఎలుగెత్తి చాటి నట్లు శ్రమజీవులు అంతా ఏకమై పోరాడితేనేహక్కులుపరిరక్షించబడతాయి. లేనిచో ఆధునిక బానిసలుగా మధ్య యుగం నాటి పరిస్థితులు ఏర్పడే ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. శ్ర మ మాత్రమే మానవ మేధస్సుకు పదును పెడుతుంది .శ్ర మద్వారానే పురోగమనం సాధ్యం. అందుకే శ్ర మ సంస్కృతిని అలవర్చుకోవాలి.. శ్రామిక దినోత్సవ స్పూర్తిగా ముందుకు సాగాలి.

– తండా సదానందం, టీపీటిఏఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌ ‌జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page