ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : బీసీలకు అడ్డ ఐన సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ స్థానాన్ని బీసీ సామజిక వర్గానికే కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి విజయవర్ధన్ నాయుడు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గత చరిత్ర చూసుకుంటే సనత్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా బీసీలకే కేటాయించిందన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాక్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి గంట సుధీర్ కుమార్, సీనియర్ నాయకులు డాక్టర్ శివ లతో కలిసి మాట్లాడుతూ రెండు మూడు నెలల క్రితం వచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన కోట నిలిమాకు కాంగ్రెస్ టికెట్వస్తుందంటూ నియోజకవర్గంలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తూ ఒకరికి ఒకరు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తుందన్నారు. తమ పోస్టర్లను చింపివేయిస్తుందని ఆరోపించారు. తాము గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న బీసీ వర్గానికి చెందిన తమను కాదని నిన్న మొన్న వచ్చిన కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తే ఉరుకోమని అన్నారు. ఓసీ ఐన నీలిమకు ఎట్టి పరిస్థితిలో టికెట్ ఇవ్వొద్దన్నారు. నియోజకవర్గం పట్ల కనీస అవగాహన నీలిమకు లేదన్నారు. శ్రీధర్ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలని ఈ విషయం ఏఐసీసీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయంపై టీపీసీసీ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కూడా లెటర్ రాసినట్లు తెలిపారు. ప్రజల్లో గుర్తింపు లేని నీలిమకు టికెట్ కేటాయిస్తే పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉందన్నారు.