తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 16: రాష్ట్రంలోని సబండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీలకు మేలు జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీని బీసీలు విశ్వసించే పరిస్థితులు లేవని బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుమీద ఏర్పడ్డ తెలంగాణ లో నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది ఆత్మబలి దానాలు చేసిన యువకులలో 1100 మంది బీసీ బిడ్డలే ఉన్నారని పేర్కొన్నారు. బీసీలకు కనీస టికెట్లు కూడా ఇవ్వని టిఆర్ఎస్ పార్టీని బీసీలు వ్యతిరేకించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం 34 శాతం రిజర్వేషన్ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం 34 శాతం ఉన్న రిజర్వేషన్ 21% తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడి సాధించిన తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోని నాలుగు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీకి పదేళ్లు అధికారం ఇస్తే బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని, అంతా అడుగడుగునా అన్యాయమే చేసిందని విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలను మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీసీ లందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బిసి డిక్లరేషన్తో బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. స్థానికంగా ఉన్న బీసీ నాయకులు స్థానిక అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క నిరుద్యోగి ఉద్యోగ అవకాశం కల్పించలేదని అన్నారు అలాంటి ఎమ్మెల్యేకు స్థానిక బీసీ నాయకులు ఏ విధంగా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. స్థానికంగా పలు కర్మాగారాలు ఉన్నప్పటికీ ఒక నిరుద్యోగి కూడా ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని అన్నారు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ నీరాజ బాల్రెడ్డి నాయకులు బాల్రెడ్డి హనుమంతు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ బంటు వేణుగోపాల్ బంటు మల్లప్ప కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కావలి సంతోష్ మెకానిక్ రాజు గౌడ్ మహిళా నాయకురాలు సౌజన్య మాధవి సోఫియా పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత తదితరులు ఉన్నారు.