సబితమ్మ విజయం ఖాయం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 25 : ఈ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో సబితమ్మ విజయం ఖాయమని మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.శనివారం కందుకూరు మండలం పరిధిలోని మిర్ఖాన్పేట్ గ్రామంలో ఆయన గడపగడపకు ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గెలుపు నల్లెరుపై నడకలాగా ఉంటుందని ఆయన తెలిపారు.సబితా రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆమె ప్రజా నాయకురాలని ఆయన కొనియాడారు.ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్,బిజెపిలను ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు.వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.ముఖ్యమంత్రిగా కెసిఆర్ రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని ఆయన అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే మరో అభివృద్ది పేరిట చరిత్ర సృష్టించడం జరుగుతుందని అన్నారు.నియోజకవర్గంలో సబితా రెడ్డి చేసిన అభివృద్దిని ప్రజలు మరవరని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page