సర్వ మతాలకు సముచిత గౌరవం

సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయం..
గాడ్ విజన్ అసోసియేషన్ పాస్టర్ యూనియన్ వారికి నా నెల వేతనం అందిస్తా…
సిద్దిపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు 
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  సిద్దిపేట సర్వ మతాలకు నెలవు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట లో గాడ్ విజన్ అసోసియేషన్, పాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నేను నామినేషన్ వేసే సమయం లో వెంకటేశ్వర స్వామి గుడి, అదేవిదంగా మన సిద్దిపేట చర్చ్ లో ప్రార్థనలు చేస్తానని గుర్తు చేశారు. సిద్దిపేట అంటే నే సర్వ మతాలకు గౌరవించే సంస్కృతి మనదన్నారు.ఏసు ప్రభు అందరి వాడు అని.. దసరా బతుకమ్మ పండుగలకి ఏవిదంగా కానుక ఇస్తామో క్రిస్మస్ కు క్రిస్టియన్ సోదరులకు కానుక ఇచ్చి గౌరవించామని చెప్పారు.. సమాజ శ్రేయస్సు కు పాటు పడుతున్న అసోసియేషన్ పెద్దలకు నా అభినందనలు.. నేను సమాజ సేవలో మీతో పాటుగా భాగస్వామ్యం అవుతానని నా నెల వేతనం మీ అసోసియేషన్ కు నా ఉడుత భక్తి సహాయం అందిస్తానని హరీష్ రావు చెప్పారు. ఈ సందర్బంగా అసోసియేషన్ వారి తో కల్సి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page